ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రతి చిన్న పనికి టెక్నాలజీ మీద విపరీతంగా ఆధారపడుతున్నాం. ఈ టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అంతా డేంజర్ కూడా అందుకే వీలనైంత కఠినంగా పాస్‌వర్డ్ పెట్టుకుంటే మంచిది లేకపోతె మన పాస్‌వర్డ్‌ను హ్యాకర్లు హాక్ చేసే అవకాశం ఎక్కువ. మీకు తెలుసా గత 12 నెలల్లో ఈ క్రింద పేర్కొన్న పాస్‌వర్డ్‌లన్నీ మిలియన్ల సార్లు హ్యాక్ చేయబడ్డాయి.
అందుకే మీరు సోమరితనం విడిచి కఠినమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకుంటే మంచిది. పాస్‌వర్డ్ మేనేజర్ నార్డ్‌పాస్ యొక్క వార్షిక నివేదిక ప్రకారం, 2020లో ‘123456’ పాస్‌వర్డ్ ఎక్కువగా హ్యాకింగ్ గురి అవ్వగా, మరో “ఐ లవ్ యు'” అనే పాస్వర్డ్ టాప్ 20 జాబితాలో నిలిచింది. నిజం చెప్పాలంటే, ‘123456’ పాస్‌వర్డ్ గత సంవత్సరంలో 23 మిలియన్ సార్లు హ్యాకింగ్ గురి అయ్యింది.
ఏక్కువ మంది ఉపయోగించిన పాస్‌వర్డ్(123456) ఇదే కాబట్టి దీన్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక రెండో స్థానంలో ఉన్న పాస్‌వర్డ్ 123456789.. మూడో స్థానంలో picture1 ఉంది. (చదవండి: దీపావళి పండుగ అమ్మకాలలో షియోమి రికార్డు)
2015లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆ సంవత్సరంలో చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ‘123456’ అగ్రస్థానంలో ఉంది,అన్నిటి కంటే కామెడీ పాస్‌వర్డ్ ‘password’ అనే పదం ఆ తర్వాత స్థానంలో ఉంది. ఐదు సంవత్సరాల తరువాత కూడా పెద్దగా పరిస్థితులు ఏమి మారలేదు. ‘123456’, ‘123456789’, ‘picture1’, ‘password’, ‘12345678’, ‘111111’, ‘123123’, ‘12345’, ‘1234567890’, ‘senha’, ‘1234567’, ‘qwerty’, ‘abc123’, ‘Million2’, ‘000000’, ‘1234’, ‘iloveyou’, ‘aaron431’, ‘password1’, ‘qqww1122’. ఈ జాబితాలో ఉన్న టాప్ 20 చెత్త పాస్‌వర్డ్‌లు ఇవి అని నార్డ్‌పాస్ సంస్థ పేర్కొంది. వీటిని బ్రేక్ చేయడానికి సెకను కన్నా తక్కువ సమయం పడుతుంది అని తెలిపింది.
ప్రతి విభాగంలో ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లను కూడా నివేదిక వివరిస్తుంది. 90,000 మంది వినియోగదారులతో ఈ సంవత్సరం పాస్‌వర్డ్‌లలో ‘ఆరోన్ 431’ ఎక్కువగా ఉపయోగించబడుతుందని, 21,409 మంది వినియోగదారులతో చాక్లెట్ ఎక్కువగా ఉపయోగించే ఆహార పేరు. 37,000 మందికి పైగా వినియోగదారులు వారి పాస్‌వర్డ్‌లలో ‘పోకీమాన్’ కలిగి ఉన్నారు.
90 వేల మందికి పైగా వినియోగించిన పాస్‌వర్డ్ ‘aaron431’ అని తెలిపింది. అలాగే ఎక్కువగా మంది ఇష్టపడే ‘chocolate’ అనే పదాన్ని 21,409 మంది వాడగా, pokemon అనే పాస్‌వర్డ్‌ను 37 వేల మంది ఉపయోగించారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.