Saturday, April 20, 2024
HomeTechnologyGadgets5000లలో బెస్ట్ టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్

5000లలో బెస్ట్ టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్

ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా స్మార్ట్‌ ఉత్పత్తులు, మొబైల్ యాక్ససరీలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ రంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ వినియోగాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ‘ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్’ విభాగం ఇటీవల భారతదేశంలో చాలా ఆకర్షణ పొందుతోంది. కొన్నేళ్ల క్రితం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎంత క్రెజ్ ఉండేదో ఇప్పుడు ఇప్పుడు ‘ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్’ కి అంత ఆకర్షణ ఉంది. అందుకే శామ్‌సంగ్, షియోమి, ఒప్పో, రియల్‌మీ వంటి బడ్జెట్ లోనే మంచి నాణ్యత గల ఇయర్ ఫోన్స్ తీసుకొస్తున్నాయి. చవక ధరలకే వస్తున్నాయంటే వీటిలో ఫీచర్లు బాగాలేవనే అంచనాలు, గాలి లెక్కలు వేయకండి. మంచి నాణ్యతతో కూడిన వస్తువులను చవక ధరలో అందుబాటులోకి తేవాలంటే చాలా రీసెర్చ్ అవసరమవుతుంది. అందుకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో శరవేగంగా దూసుకుపోతున్నా ఇలాంటి సంస్థలు ఇన్నోవేటివ్ ప్రాడక్ట్స్ ను మనకు పరిచయం చేస్తున్నాయి. 5,000లలో బెస్ట్ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ మరి వాటి ఫీచర్స్‌, ధర, వంటి వివరాలు మీ కోసం..(చదవండి: సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్)

ఒప్పో ఏక్నో W51: ‘ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్’ మార్కెట్లో ఒప్పో యొక్క ఆవిష్కరణ అయిన ఒప్పో ఏక్నో W51లో మంచి ఫీచర్లు ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో 7 ఎంఎం డైనమిక్ డ్రైవర్ ఆన్‌బోర్డ్, సుమారు 10 మీటర్ల పరిధి వరకు వస్తుంది. ప్రతి ఇయర్‌బడ్ లో 25 ఎంఏహెచ్ బ్యాటరీతో నిండి ఉంటుంది, ఛార్జింగ్ కేసులో 480 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒప్పో ఏక్నో W51 ఆన్ చేస్తే ఈ ఇయర్ ఫోన్ 3.5 గంటలు పనిచేస్తుంది. ఒప్పో ఏక్నో W51 ఆన్ చేయకపోతే 20 గంటలపాటు పనిచేసేలా బ్యాటరీ సామర్థ్యం ఉండడం హైలైట్. అయితే, బ్యాటరీ ఇక్కడ చాలా సగటు. మీరు 15 నిమిషాల ఛార్జ్ చేస్తే ఇయర్‌ఫోన్‌లు 3 గంటల వరకు పనిచేస్తాయి. దీనికి 3 మైక్రో పోన్ సిస్టంను ఒప్పో యాడ్ చేసింది. దీంతో సౌండ్ క్వాలిటీ చాలా బాగుండి, నాయిస్ తగ్గుతుంది. దీని ధర రూ. 4,999.

రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో:

రియల్‌మే బడ్స్ ఎయిర్ ప్రో అత్యంత చవకైన వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ గా పేరుంది. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండటం వల్ల ఇవి బాగా పనిచేస్తాయి. రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో ఫీచర్-ప్యాక్డ్, కంపానియన్ యాప్ సపోర్ట్ వల్ల ఉపయోగించడం సులభం చేస్తుంది. రియల్‌మీ బడ్స్ ఎయిర్ ప్రోలో సౌండ్ క్వాలిటీ సరిగ్గా లేనప్పటికీ, మీకు అద్భుతమైన సౌండ్‌స్టేజ్, బేస్ భారతదేశంలో చాలా మంది ప్రజలు ఇష్టపడే విధంగా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే సూపర్ అనుకోండి. ఏకంగా 25 గంటల బ్యాటరీ లైఫ్ తో ఈ ఇయర్ బడ్స్ పనిచేస్తాయని రియల్ మీ చెబుతోంది. దీని ధర రూ .4,999

వన్‌ప్లస్ బడ్స్:

- Advertisement -

వన్‌ప్లస్ సంస్థ యొక్క మొట్టమొదటి టిడబ్ల్యుఎస్, వన్‌ప్లస్ బడ్స్‌ను వన్‌ప్లస్ నార్డ్‌తో పాటు ఇటీవల ఆవిష్కరించారు. వన్‌ప్లస్ బడ్స్ ఒక్క సారి ఛార్జ్ చేస్తే 7 గంటల వరకు పనిచేస్తుంది. ఛార్జింగ్ కేసుతో అయితే మీరు 30 గంటల వరకు పొందుతారు. మీరు 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు వస్తుంది. డైనమిక్ డ్రైవర్ డిరాక్ ఆడియో ట్యూనర్ సపోర్ట్ తో డాల్బీ అట్మోస్‌తో 3డి స్టీరియోకూడా పని చేస్తుంది. వన్‌ప్లస్ ఫోన్ తో పనిలేకుండా కేవలం అపిషియల్ యాప్ తోనే ఇది బ్రహ్మాండంగా పనిచేసేలా కస్టమైజ్ కంట్రోల్ అనే సరికొత్త ఫీచర్ ను జోడించారు. దీని ధర రూ. 4,990.

నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో:

ఒక్క సారి చార్జ్ చేసిన నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో బ్యాటరీ లైఫ్ 8 గంటలు. క్వాల్ కామ్ చిప్ సెట్ సపోర్ట్ తో పనిచేసే ఈ ఆడియో ప్రాడక్ట్ నాణ్యతలో అత్యుత్తమంగా ఉంది. 2,200mAh బ్యాటరీ కేస్ ను కావాలంటే మీ స్మార్ట్ ఫోన్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. నాయిస్ షాట్స్ ఎక్స్ 5 ప్రో టిడబ్ల్యుఎస్ బ్లూటూత్ 5.0పై పని చేస్తుంది. కాల్ కామ్ చిప్ సెట్ సపోర్ట్ తో పనిచేసే ఈ ఆడియో ప్రాడక్ట్ నాణ్యతలో అత్యుత్తమంగా ఉంది. ఈ కారణంగా ఇయర్ ఫోన్లో ఏదైనా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. AptX+AAC Hi-Fiఆడియో టెక్నాలజీతో IPX7 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది. దీనిలో ప్రతి ఇయర్ బడ్ టచ్ సెన్సార్లతో వస్తుంది, అందువల్ల వాల్యూమ్‌ను నియంత్రించడానికి, కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి / తిరస్కరించడానికి , మీడియాను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 3,499.

షియోమి ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2:

షియోమి ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ఏకంగా రూ. 3,999 ధరకే లభిస్తోంది. చూసేందుకు ఇయర్ ప్యాడ్స్ లాంటి ఇయర్ పీస్ లా దీన్ని డిజైన్ అయిన ఈ ఇయర్ పీస్ ఫీచర్స్ బాగున్నాయి. 14.2mmడ్రైవర్స్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, SBC, AAC, LHDC బ్లూటూత్ codecs సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. కానీ ఇందులో ANC లేకపోవడం మీ చుట్టూ ఉన్న శబ్దాలు వినిపిస్తాయి. 12 గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం షియోమీ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ కు ఉండగా, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles