Sunday, October 13, 2024
HomeTechnologyTips & TricksMobile Battery Life: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోండి ఇలా..!

Mobile Battery Life: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోండి ఇలా..!

How To Increase Mobile Battery Life: ఈ ఆధునిక యుగంలో రోజు రోజుకి స్మార్ట్ ఫోన్‌ల వినియోగం భారీగా పెరిగిపోతుంది. మనం ప్రతి చిన్న పనికి వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాము. ఇలా రోజంతా ఫోన్ లో మనం గడపడం వలన మన బ్యాటరీ మీద చాలా ప్రభావం పడుతుంది. దీని వలన మన ఫోన్ బ్యాటరీ సామర్థ్యం అనేది తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 చిట్కాలు అనేవి మీ Mobile Battery Lifeని పెంచుతాయి.

మీ మొబైల్ జీపీఎస్ మరియు బ్లూటూత్‌ను నిలిపివేయడం

అతిపెద్ద బ్యాటరీ డ్రైనర్లలో ఒకటి GPS Feature, దీన్ని మనకు అవసరం లేకున్నా ఆన్ చేయడం వల్ల బ్యాటరీ అనేది తొందరగా తగ్గిపోతుంది. మీరు ఈ ఫీచర్ ని వాడుకొనప్పుడు నిలిపివేయడం మంచిది. మీ ఫోన్‌లో పైన ఉన్నా GPS సింబల్ ని నొక్కి ఆఫ్ చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా మన మొబైల్ లోని Bluetooth అనేది కూడా బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకోసం దీనిని కూడా ఆఫ్ చేయడం మంచిది.

Display Brightnessని తగ్గించడం

స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన వాటిలో ఒకటి డిస్ప్లే. మీ ఫోన్ డిస్ప్లే బ్రైట్ నెస్ ఎంత ఎక్కువగా ఉంటే.. అంతా తొందరగా మీ ఫోన్ బ్యాటరీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి, Auto Brightness అనే ఆప్షన్ ఎంచుకుంటే చాలా మంచిది. ఇది మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి Brightnessని తగ్గించడం లేదా పెంచడం చేస్తుంది.

అవసరంలేని Apps తొలిగించడం

మనం చాలా సార్లు చిన్న చిన్న అవసరాలకు కూడా కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే,వాటి అవసరం తీరిన తర్వాత కూడా వాటిని Uninstall చేయడం మర్చిపోతుంటాం. అందుకని మనం వెంటనే మొబైల్లో అవసరం లేని యాప్స్ ని తొలిగించడంతో పాటు, మన బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ ని ఎప్పటికప్పుడు తొలిగించడం చాలా మంచిది.

- Advertisement -

Always On Display ఫీచర్ నిలిపివేయడం

మనం మన ఫోన్ ని ఆఫ్ చేసినప్పుడు లేదా పక్కన పెట్టినప్పుడు మన మొబైల్ స్క్రీన్ మీద చాలా యాప్స్ నోటిఫికేషన్లు కనిపిస్తాయి. అయితే, ఇవి కూడా మన మొబైల్ బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. కావున మనం మనకు అవసరం లేని యాప్స్ ఆన్ డిస్ప్లే ఫీచర్ నిలిపివేస్తే మంచిది.

Live Wallpapers off చేయడం

లైవ్ వాల్‌పేపర్‌లు గురుంచి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతా మంచిది. చాలా మొబైల్ కంపెనీలు యూజర్ల దృష్టిని ఆకర్షించడానికి ఈ లైవ్ వాల్‌పేపర్ ఫీచర్ని తీసుకొస్తున్నాయి. అయితే, ఈ ఫీచర్ ఆన్ చేసినప్పుడు మన మొబైల్ బ్యాటరీ చాలా త్వరగా తగ్గిపోతుంది… ఈ ఫీచర్ ఆఫ్ చేస్తే చాలా మంచిది. దీని వల్ల మన మొబైల్ బ్యాటరీ సామర్థ్యాన్ని చాలా వరకు పెంచుకోవచ్చు.

(ఇది కూడా చదవండి: Smartwatch Buying Guide Tips: స్మార్ట్‌వాచ్‌లు కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles