ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వాడుతున్న మొబైల్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. అంతలా ఆకట్టుకుంటుంది వాట్సాప్ ప్రజలను. తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకోస్తూ ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు వాట్సాప్ స్టేటస్ ఉన్న వీడియో లేదా ఫోటోను డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ ఇప్పటివరకు తీసుకుని రాలేదు. ప్రతి ఒక్కరూ ఇతరులు పెట్టిన వీడియోలలో తమకు నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని అనుకుంటారు. వాటిని ఇప్పుడు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్‌లోకి వెళ్లండి.
  2. మీరు ఏం డౌన్‌లోడ్ చెయ్యాలనుకుంటున్నారో దానిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
  3. ఇప్పుడు మీ మొబైల్‌లోని ఫైల్ మేనేజర్ ఫోల్డర్ ఓపెన్ చేయండి.
  4. తర్వాత సెట్టింగ్స్‌లోకి కనిపించే Show Hidden Files ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి.
  5. మళ్లీ వెనక్కి వచ్చి స్టోరేజ్‌లోకి వెళ్లి వాట్సాప్‌ ఫోల్డర్ ఓపెన్ చేయండి.
  6. వాట్సాప్ ఫోల్డర్ లో కనిపించే మీడియా ఆప్షన్‌ ఓపెన్ చేసి స్టేటస్(statuses) ఆప్షన్‌ను ఎంచుకోండి.
  7. అందులో మీరు గమనించిన వాట్సాప్ స్టేటస్‌లో చూసిన వీడియోలు, ఫొటోలూ ఉంటాయి.
  8. వాటిని కాపీ చేసి… వేరే ఫోల్డర్‌లో సేవ్ చేసుకోండి.

ఈ విధంగా మీరు వాట్సాప్ స్టేటస్‌లోని ఫొటోలూ, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విధానం కూడా ఉంది. గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి “వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ మేనేజర్ యాప్” డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీకు నచ్చిన వీడియో లేదా ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.