ప్రస్తుతం ఇంటర్నెట్ సౌకర్యం అనేది చిన్న చిన్న పట్టణాలకు సైతం అందుబాటులోకీ వచ్చేసింది. ఇంటర్నెట్‌ను వాడే సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. చౌకైన ఇంటర్నెట్ ప్యాక్స్ అందుబాటులో ఉండటం, పబ్లిక్‌లో ఉచిత వై-ఫై ద్వారా ఇంటర్నెట్ లభిస్తుండటం దీని ప్రధాన కారణాలు. అలాగే, ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం కాఫీ దుకాణాలు, రెస్టారెంట్లు వంటి పబ్లిక్ ప్రదేశాలలో వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. కానీ, వెళ్లిన ప్రతిసారి వైఫై పాస్‌వర్డ్ ఆడగాలంటే చాలా మంది మొహమాటం పడుతుంటారు.(ఇది కూడా చదవండి: సినిమాలో విలన్లు ఆపిల్ ఐఫోన్ ఎందుకు వాడరో తెలుసా?)

అయితే, ఇలా ప్రతిసారి చేయకుండా ఒకసారి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కనెక్ట్ అయిన తర్వాత వై-ఫై పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోవాలి. మీరు గతంలో ఫోన్‌కు కనెక్ట్ చేసిన నెట్‌వర్క్ వై-ఫై పాస్‌వర్డ్‌ను కొన్ని ట్రిక్స్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా..?

  • మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వైపై పాస్‌వర్డ్ వ్యూయర్(రూట్) యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
  • యాప్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకునేందుకు మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది.
  • పర్మిషన్ ఓకే చేసినట్లయితే వై-ఫై పాస్‌వర్డ్‌ను స్టోర్ చేసిన సేవ్ ఫైల్‌ను చదవడానికి అనుమతిస్తుంది.
  • అలాగే, కొన్ని సార్లు మీ మొబైల్ రూట్ చేయమని కూడా అడగవచ్చు.
  • గతంలో మీరు కనెక్ట్ చేసిన అన్ని నెట్‌వర్క్స్ పాస్‌వర్డ్స్ జాబితాను ఈ యాప్ ప్రదర్శిస్తుంది.
  • ఇక్కడ మీరు పాస్‌వర్డ్‌ను క్లిప్ బోర్డ్‌ను కాపీ చేయవచ్చు. లేదా ఏదైనా యాప్‌ను ఉప‌యోగించి దాని నుంచి షేర్ చేసుకోవచ్చు.
  • అంతేకాదు మీరు ఒక క్యూఆర్ కోడ్‌ను జెనరేట్ చేయవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.