Thursday, November 21, 2024
HomeTechnologyWhatsApp Tricks and Tips in Telugu: వాట్సాప్‌లో అదిరిపోయే టాప్-5 టిప్స్ అండ్ ట్రిక్స్...

WhatsApp Tricks and Tips in Telugu: వాట్సాప్‌లో అదిరిపోయే టాప్-5 టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసమే!

WhatsApp Tricks and Tips in Telugu: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లేకుండా ప్రస్తుత సమాజం ముందుకు వెళ్ళడం లేదు అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఏ చిన్న మెసేజ్ చేయాలని అనుకున్న లేదా ఒక ఫోటో/ ఫైల్ పంపించాలని అనుకున్న ఎక్కువ మంది వినియోగించే యాప్ వాట్సాప్.

ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు దీనిని వినియోగిస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత క్రేజ్ ఉంది అనేది. అయితే, వాట్సాప్ సంస్థ కూడా తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లో ప్రస్తుతం చాలా ఫీచర్‌లు ఉన్నాయి అనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్లలో 5 మంచి ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1) క్వాలిటి తగ్గకుండా ఫోటోలు, వీడియోలను పంపుకోండి ఇలా..

మీరు WhatsAppలో ఫోటో లేదా వీడియోను పంపినప్పుడు దాని క్వాలిటి అనేది కొద్ది వరకు తగ్గుతుంది. అయితే, ఇక నుంచి WhatsAppలో మీరు పంపిన ఫోటో లేదా వీడియా నాణ్యతను కోల్పోకుండా ఉండటానికి ఒక మార్గం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

(ఇది కూడా చదవండి: LIC WhatsApp Services: వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవలు.. ఎలా పొందాలి?)

ఇక నుంచి మీరు ఎవరికైనా ఫోటో/వీడియో పంపాలని అనుకున్నప్పుడు Gallery అనే ఆప్షన్ బదులు Docuement ఎంచుకోండి. ఇప్పుడు మీ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో మీరు పంపాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోను సెలెక్ట్ చేసుకొని పంపండి. ఇలా చేయడం ద్వారా మీరు పంపిన ఫోటో/వీడియో క్వాలిటి అనేది తగ్గకుండా ఉంటుంది. ఇక ముఖ్యం మరో విషయం, ఇప్పుడు వాట్సాప్ ద్వారా గరిష్టంగా 2 GB వరకు ఫైల్‌లను పంపవచ్చు.

- Advertisement -

2) వాట్సాప్ స్టేటస్‌ని మీ ఫ్రెండ్స్‌కు తెలియకుండా చూసేయండి:

వాట్సాప్ ఎంతో ఫేమస్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, ఆ సంస్థ తీసుకొచ్చిన ఫీచర్స్’లో వాట్సాప్ స్టేటస్ చాలా ముఖ్యమైనది. అయితే, అలాంటి స్టేటస్‌ని వారికి తెలియకుండా మనం చూడవచ్చు. మొదట వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయగానే మీకు నచ్చిన స్టేటస్‌ని ఓపెన్ చేయకండి.

మీ మొబైల్’లో Airplane Mode On చేసి ఆ తర్వాత ఆ వ్యక్తి స్టేటస్ ఓపెన్ చేసి చూడండి. ఇలా చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్‌కు తెలియకుండా వారి వాట్సాప్ స్టేటస్‌ని చూడవచ్చు.

3) ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌కు తెలియకుండా మెసేజ్ చదవండి:

మీ ఫ్రెండ్స్ పంపిన వారు పంపిన సందేశాలను చదవవచ్చు అనే విషయం మనలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు వాట్సాప్ ఒక వ్యక్తి పంపిన మెసేజ్ మనం చదవమా లేదా అనేది తెలియజేసేది Double Blue Tick. మనం గనుక ఆ మెసేజ్ చదివిన కూడా బ్లూ టిక్ రాకపోతే అవతలి వ్యక్తి తన మెసేజ్’ని మనం చదవా లేదు అనుకుంటాడు.

  • ఇలా అవతల వ్యక్తి మెసేజ్ తనకు తెలియకుండా చదవడానికి మొదట వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత Settings > Account > Privacy ఆప్షన్ ఎంచుకొని turn off the Read Receipts option మీద క్లిక్ చేయండి.
  • పై విధంగా చేయడం ద్వారా వేరే వ్యక్తి పంపిన మెసేజ్’లను తనకు తెలియకుండా చదవవచ్చు.
  • ఇక్కడ ఒక నష్టం కూడా ఉంది. మనం పంపిన సందేశాలు వారు చదివారో లేదో కూడా మనకు తెలియదు.

ఇలా మీకు కాకూడదు అంటే మనకు మరొక సులువైన మార్గం ఉంది. వేరే వ్యక్తి మెసేజ్ పంపిన వెంటనే ఓపెన్ చేయకుండా మీ మొబైల్’లో Airplane Mode On చేసి చదవడం ద్వారా మీరు ఆ మెసేజ్ ఆ విషయం అవతలి వ్యక్తికి తెలియదు.

4) వేర్వేరు వ్యక్తులకు గ్రూప్’లో కాకుండా అందరికీ ఒకేసారి మెసేజ్ పంపండి:

కొన్ని సార్లు మనం Whatsapp కాంటాక్ట్‌లందరికీ ఒకే సందేశాన్ని(ఉదా: పండుగ సందేశాలు) పంపాల్సి వచ్చినప్పుడు ఆ సందేశాన్ని ఒక్కరికీ వేరెవెరుగా పంపుతాము. అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను అనుసరిస్తే మీరు కాంటాక్ట్‌లందరికీ ఒకే సందేశాన్ని ఒకేసారి పంపవచ్చు.

- Advertisement -

 (ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి ఇలా..?)

  • ఇందుకోసం మొదట WhatsApp ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు వాట్సాప్ మెనూలో New Broadcast ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • మీకు నచ్చిన కాంటాక్ట్‌ని ఎంచుకుని టిక్ మార్క్‌ని క్లిక్ చేయండి
  • ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా సందేశాన్ని పంపినట్లయితే, అది మీరు ఎంచుకున్న ప్రతి నంబర్‌కు వెళ్తుంది. దీని వల్ల మనకు చాలా సమయం కూడా ఆదా అవుతుంది.

5) మీ ఫ్రెండ్స్ బబ్లూ టిక్ ఆఫ్ చేసిన వారు మీ మెసేజ్ చదివారో లేదో తెలుసుకోవచ్చు

మనం పైన చెప్పిన దానిలో ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌కు తెలియకుండా మెసేజ్ చదవవచ్చు గురించి తెలుసుకున్నాం. అయితే, ఇక్కడ చిన్న లోపం ఉంది. మీరు బ్లూ టిక్ ఆఫ్ చేసి మీ మిత్రుల మెసేజ్’లను చదివినా ఆ విషయం మీ మిత్రుడు తెలుసుకోవచ్చు.

  • మొదట మీరు మీకు నచ్చిన మిత్రుడికి ఒక మెసేజ్ పంపండి.
  • ఆ తర్వాత ఆ మెసేజ్ మీద ఒక సెకను Long Press చేయండి.
  • ఇప్పుడు కుడి వైపు మూలలో ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేసి Info మీద క్లిక్ చేయండి.
  • మీ ఫ్రెండ్ మీ మెసేజ్ చదివితే ఎప్పుడు చదివాడో అనే సమయంతో పాటు బ్లూ టిక్ కూడా కనిపిస్తుంది.
  • ఒకవేళ బ్లూ టిక్ లేకపోతే తను ఆ మెసేజ్ చదవలేదు అని అర్థం.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles