Whatsapp Multi-Account Feature in Telugu: వాట్సాప్ తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్(Android) వినియోగదారుల కోసం మల్టీ-అకౌంట్ ఫీచర్‌ను(multi-account feature ) అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.
(ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి ఇలా..?)
ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఒక మొబైల్లోనే చాలా WhatsApp ఖాతాలను యాక్సెస్ చేసుకోవచ్చు. WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ Android వినియోగదారుల కోసం ఈ బహుళ-ఖాతా సపోర్ట్ ఫీచర్‌పై పనిచేస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నా పోటీని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొని వస్తుంది.
WhatsApp బహుళ ఖాతా ఫీచర్ పని విధానం:
వాట్సాప్ మల్టీ-ఖాతా ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే ఒకే మొబైల్లో వేర్వేరు ఖాతాల ఓపెన్ చేయడానికి సహాయపడుతుందని సమాచారం. నివేదిక ప్రకారం, యాప్ ఈ ఖాతాల కోసం పాస్‌వర్డ్‌ను సేవ్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే కేవలం ఒక ట్యాప్‌తో(Password సహాయంతో) మరో ఖాతాకు మారవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా అభివృద్ధిలో దశలోనే ఉంది, త్వరలో అందరికీ అందరికీ అందుబాటులో ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.