Thursday, December 5, 2024
HomeStoriesప్రపంచంలోనే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్

ప్రపంచంలోనే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్

మన దేశంలో ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులలో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నింటి కంటే భారీ ప్రాజెక్టు. ఇప్పుడు చైనాలో 10 కాళేశ్వర ప్రాజెక్టులకు సమానమైన ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. దాని పేరే “సౌత్-టు-నార్త్ వాటర్ డైవర్షన్ ప్రాజెక్ట్”. ఈ ప్రాజెక్టు ద్వారా చైనాకు దక్షిణ భాగంలో ఉన్న నదుల నుంచి నీటిని ఉత్తర భాగంలో ఉన్న ప్రజలకు అందించడం ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర భాగంలో ఉన్న నీటిని దక్షిణ భాగంలో ఉన్న భూభాగనికి ఏ విదంగా తరలిస్తారో ఆ విదంగా అక్కడి కూడా కొన్ని భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా దశల వారీగా నీటిని చెరవేస్తారు. ఈ భారీ పథకం ప్రారంభించినప్పటి నుంచి పూర్తి కావడానికి 50 సంవత్సరాలు పడుతుంది అంచనా. 2050 చివరి నాటికి పూర్తి చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీని ద్వారా 44.8 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఉత్తరాన ఉన్న భూభాగానికి మళ్లించనున్నారు.

ఇంకా చదవండి: మోదీ అదిరిపోయే కానుక.. రైతుల అకౌంట్లలోకి ఇక రూ.10 వేలు?

ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా యొక్క నాలుగు ప్రధాన నదులైన యాంగ్జీ, ఎల్లో రివర్, హువాయి, హైహేలను కలపనున్నారు. కొత్తగా మరో మూడు భారీ పరిమాణంలో గల కాలువలు నిర్మించనున్నారు. ఈ నిర్మాణం ద్వారా చైనాలోని 40 శాతం భూభాగనికి నీరు అందించేలా నిర్మాణం చేపడుతున్నారు. పూర్తి ప్రాజెక్టుకు 5 లక్షల కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.

నీటి మళ్లింపు ప్రాజెక్టు నేపథ్యం

ఉత్తర చైనా చాలాకాలంగా జనాభా, పరిశ్రమ, వ్యవసాయానికి కేంద్రంగా ఉంది. అక్కడ దక్షణ భూ భాగంతో పోలిస్తే ఉత్తరం భూ భాగం చాలా సారవంతమైనది. దక్షిణ భూ భాగంలో కొండ ప్రాంతాలు ఉండటంతో చాలా తక్కువ జనాభా ఇటు వైపు నివసిస్తున్నారు. కానీ, ఉత్తర భాగంలో ఉన్న ప్రజల నీటి అవసరాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న నీటి వనరులు సరిపోవడం లేదు.

ఉత్తర భాగంలో నీటి కొరత కారణంగా భూగర్భజలాలను అధికంగా వినియోగిస్తున్నారు. వ్యవసాయ వ్యయంతో పాటు పట్టణ, పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతకు దారితీస్తుంది. పెరుగుతున్న నీటి కొరతను తీర్చడానికి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని నిర్మాణం చేపట్టారు.

1952లోనే ప్రాజెక్టుకు మొదట రూపకల్పన

దివంగత ఛైర్మన్ మావో జెడాంగ్ 1952లో భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆలోచనను ప్రతిపాదించారు. బీజింగ్, టియాంజిన్ నగరాల్లో మరియు ఉత్తర ప్రావిన్సులైన హెబీ, హెనాన్, షాన్డాంగ్ నగరాల్లో పెరుగుతున్న నీటి కొరతను తీర్చడానికి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఉద్దేశించారు.

ఇంకా చదవండి: మోదీ అదిరిపోయే కానుక.. రైతుల అకౌంట్లలోకి ఇక రూ.10 వేలు?

2002 ఆగస్టు 23న 50 సంవత్సరాల తరువాత విస్తృతమైన పరిశోధన, ప్రణాళిక మరియు చర్చల తర్వాత ఈ ప్రాజెక్టును స్టేట్ కౌన్సిల్ ఆమోదించింది. 2002 డిసెంబరులో ప్రాజెక్ట్ యొక్క తూర్పు మార్గంలో పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణంను త్వరితగతిన పూర్తి చేయడం కోసం చైనా ప్రభుత్వం ఒక ప్రత్యేక పరిమిత ప్రభుత్వ సంస్థను సృష్టించింది. ప్రతి ప్రావిన్స్ స్థానిక పరిపాలన, మౌలిక సదుపాయాల నిర్వహణకు నీటి సరఫరా సంస్థను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

- Advertisement -

పర్యావరణ ఆందోళనలు

చైనా మెగా ప్రాజెక్ట్ త్రీ గోర్జెస్ ఆనకట్ట వలె ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల అనేక పర్యావరణ సమస్యలను ఏర్పడనున్నట్లు అక్కడి పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా పురాతన వస్తువుల నష్టం, ప్రజల స్థానభ్రంశం, పంట భూముల వినాశనం జరగనున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ యొక్క మార్గాల్లో పారిశ్రామికీకరణ ద్వారా నీటి కాలుష్యం తీవ్రత ఎక్కువ కానునట్లు తెలియజేస్తున్నారు. పర్యావరణ ముప్పును ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం జియాంగ్డు, హువాయాన్, సుకియాన్, జుజౌ కోసం కేవలం 80 మిలియన్ డాలర్లను కేటాయించింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles