Thursday, April 25, 2024
HomeStoriesఎలన్ మస్క్(సిగ్నల్), మార్క్ జూకర్‌బర్గ్ (వాట్సాప్) మధ్య ఘర్షణకు కారణం ఏమిటి?

ఎలన్ మస్క్(సిగ్నల్), మార్క్ జూకర్‌బర్గ్ (వాట్సాప్) మధ్య ఘర్షణకు కారణం ఏమిటి?

వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని జనవరి 4న తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కొత్త ప్రైవసీ పాలసీ నిబందనల ప్రకారం ఎవరైతే వాట్సాప్ కొత్త నిబందనలను అంగీకరించరో వారి మొబైల్ ఫోన్ లలో వాట్సాప్ పని చేయదని సంస్థ ప్రకటించింది. ఇలా వాట్సాప్ కొత్త నిబందనలను ప్రకటించిన కొద్దీ గంటల తర్వాత ఎలన్ మస్క్ తన ట్విటర్ పేజీలో ” సిగ్నల్ వాడండి” అని ట్వీట్ పెట్టాడు. అప్పటి నుంచి సిగ్నల్ యాప్ డౌన్లోడ్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.

ఇంకా చదవండి: కొత్త ప్రైవసీ పాలసీ నిబందనలపై స్పష్టత ఇచ్చిన వాట్సాప్

ఎలన్ మస్క్, జూకర్‌బర్గ్ మధ్య ఘర్షణకు కారణం ఇదే!

ఎలన్ మస్క్ ఇలా వాట్సాప్ కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం గతంలో వీరి మధ్య ఉన్న గొడవలు. ఈ గొడవ ఇప్పటి నుంచి కాదు గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఎలోన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కృత్రిమ మేధస్సు నుంచి రాకెట్ల వరకు ప్రతిదానిపై ఘర్షణ పడ్డారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ చాలా కాలం నుంచి ఘర్షణ కొనసాగుతుంది. ఫేస్‌బుక్ ఉపగ్రహాన్ని తీసుకెళ్తున్న స్పేస్‌ఎక్స్ రాకెట్ 2016లో పేలిపోయినప్పుడు దాని వైఫల్యం గురించి మార్క్ జూకర్‌బర్గ్ చాలా గాటు విమర్శలు చేశారు. అలాగే, కేంబ్రిడ్జ్ ఎనలిటిక్స్ కుంభకోణంలో ఫేస్‌బుక్ చిక్కుకున్నప్పుడు మస్క్ తన కంపెనీల ఫేస్‌బుక్ పేజీలను బహిరంగంగా తొలగించి ఆ సంస్థ తనకు “విల్లీస్” ఇస్తుందని ట్వీట్ చేశాడు.

ఆ అంశంపై అతని అవగాహన పరిమితం మాత్రమే

‌”స్పేస్‌ఎక్స్ వైఫల్యం వల్ల మా ఉపగ్రహం పేలిపోయిందని విన్నందుకు నేను చాలా నిరాశ చెందాను, దీని ద్వారా అభివృద్ది చెందుతున్న చాలా మంది పారిశ్రామికవేత్తలకు, ప్రతి పౌరుడికి ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని మేము భావించాం” అని మార్క్ జూకర్‌బర్గ్ పేర్కొన్నాడు. రెండు సంవత్సరాల తరువాత మస్క్ విలేకరి కెర్రీ ఫ్లిన్కు చేసిన ట్వీట్‌లో విఫలమైన ప్రయోగాన్ని ఉద్దేశించి ఈ విదంగా పేర్కొన్నాడు. “అవును, ఆ విషయంలో ఇడియట్ గా ఉన్నందుకు నా తప్పు.. మేము వారి గ్రహాన్ని ఉచిత ప్రవేశపెడతాం అని పేర్కొన్నాము. ఆ ప్రయోగానికి వారికి కొంత భీమా కూడా లభిస్తుందని నేను భావిస్తున్నాను” అని ఎలన్ మస్క్ పేర్కొన్నాడు.

- Advertisement -

ఫేస్‌బుక్ లైవ్ ప్రసారం సందర్భంగా.. ఒక ప్రేక్షకుడు జుకర్‌బర్గ్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అడిగారు. “దీనిపై నాకు చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై నేను చాలా ఆశావాదిగా ఉన్నాను. కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు అని” జుకర్‌బర్గ్ అన్నారు. ఈ విషయంపై ప్రతిస్పందనగా ఏలోన్ మస్క్ “”నేను దీని గురించి మార్క్‌తో మాట్లాడాను.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై అతని అవగాహన పరిమితం మాత్రమే” అని అన్నారు.

ఇంకా చదవండి: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబందనలు వారికి మాత్రమే..?

వాట్సాప్ కోఫౌండర్ బ్రియాన్ ఆక్టన్ 2018లో ఫేస్‌బుక్ నుంచి వైదొలిగినప్పుడు “ఇది సరైన సమయం ఫేస్‌బుక్ ని” తొలిగించడానికి అని మస్క్ అన్నాడు. బ్రియాన్ ఆక్టన్ బయటకి వచ్చాక తను స్వంతగా మరో యాప్ ని సృష్టించాడు. ఆ యాప్ పేరు ” సిగ్నల్”.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భాగ ప్రజాదరణ పొందుతుంది. ఇందులో ఏలోన్ మస్క్ కొద్దిగా పెట్టుబడులు కూడా పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రైవసీ పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా వాట్సాప్ లో ఉన్న ఫీచర్స్ ఇందులో లేక పోవడం కొద్దిగా మైనస్ అని నిపుణులు తెలుపుతున్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles