మన దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ చేయడానికి, బ్యాంక్ ఖాతా తెరవడం కోసం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి పాన్ కార్డు కచ్చితంగా అవసరం అవుతుంది. అలాంటి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే గంటల తరబడి మీ సేవ, పాన్ కార్డ్ సేవ కేంద్రాల్లో క్యూ లైన్ లో నిలబడాల్సి ఉంటుంది.
అక్కడ ఏమైన ఉచితంగా లభిస్తుందా అంటే అది కూడా రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పాన్ కార్డ్ కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడకుండా ఇంట్లో నుంచే కేవలం 5 నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ-పాన్ కార్డు కోసం మనం ప్రత్యేకంగా ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ-పాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ-పాన్ కార్డు పొందడం ఎలా?
- https://www.incometax.gov.in/iec/foportal/ పోర్టల్ హోమ్ పేజీలో “Our Service” విభాగంలో ‘ఇన్ స్టంట్ ఈ-పాన్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు ‘Get New e-PAN’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, చెక్ బాక్స్ క్లిక్ చేసి “Continue” బటన్ నొక్కండి.
- ఆధార్ నంబర్ తో లింకు చేసిన మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, చెక్ బాక్స్ క్లిక్ చేసి “Continue” బటన్ నొక్కండి.
- ఇప్పుడు మీ ఆధార్ వివరాలను చెక్ చేసి మెయిల్ ఐడీ ఇవ్వకపోతే, ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయండి.
- తర్వాత మీరు చెక్ స్టేటస్, డౌన్ లోడ్ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో పొందవచ్చు.
గమనిక: ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త పోర్టల్ లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యల వల్ల గతంలో వచ్చిన విధంగా వెంటనే పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే ఇవ్వడం లేదు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోగలరు.