Nothing Phone 1 Launched in India: ఈ ఏడాది 2022లో ఏదైనా ఒక మొబైల్ బాగా పాపులర్ అయ్యింది అంటే నథింగ్ ఫోన్ 1(Nothing Phone 1) అని చెప్పుకోవాలి. గత కొంత కాలంగా ఈ మొబైల్’కు వచ్చిన పాపులరిటీ ఏ మొబైల్’కు రాలేదు. యువత కూడా ఈ మొబైల్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఈ మొబైల్ మన దేశ మార్కెట్లో విడుదల అయ్యింది. కార్ల్ పీ కొత్త కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ ‘నథింగ్’ పేరుతో ఆండ్రాయిడ్ మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించింది.
కార్ల్ పీ 2013లో పీట్ లావ్ తో కలిసి వన్ ప్లస్ బ్రాండ్ ప్రారంభించారు. 2020 ఏడాదిలో కార్ల్ పీ వన్ ప్లస్ విడిచి పెట్టి నథింగ్ ప్రారంభించారు. నథింగ్ కంపెనీ నుంచి మొదటి ఉత్పత్తి నథింగ్ ఇయర్ (1) ఇయర్ బడ్స్. ఈ స్మార్ట్ ఫోన్’లో ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ-లైటింగ్ బ్యాక్ ప్యానెల్తో వస్తుంది. ఈ మొబైల్ మూడు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో మరియు నలుపు & తెలుపు అనే రెండు రంగులలో కనిపిస్తుంది.
Nothing Phone 1 లాంచ్ ధర మరియు వేరియంట్లు
నథింగ్ ఫోన్ (1) భారతదేశంలో 21 జూలై 2022 రాత్రి 7 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్లో బ్లాక్ అండ్ వైట్ రంగులలో లభ్యం అవుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు లాంచ్ ఆఫర్లను పొందడానికి స్మార్ట్ఫోన్ను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు. స్టోరేజీని విస్తరించడానికి ఫోన్లో మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ లేదని మరియు బాక్స్ లోపల మీరు ఎలాంటి ఛార్జింగ్ అడాప్టర్ లేదా ప్రొటెక్షన్ కేస్ లభించదు అని గమనించాలి.
Nothing Phone 1 Price
నథింగ్ ఫోన్ (1) 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ధర: రూ.32,999
నథింగ్ ఫోన్ (1) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ధర: రూ.35,999
నథింగ్ ఫోన్ (1) 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ధర: రూ.38,999
ఇంకా 45వాట్ల ఛార్జింగ్ అడాప్టర్ కోసం రూ.2,499, ఒరిజినల్ క్లియర్ కేస్ కోసం రూ.1,499 ఖర్చు అవుతుంది. ఇంకా, టెంపర్డ్ గ్లాస్’ను రూ.999కు విక్రయిస్తున్నారు. మీరు నథింగ్ ఫోన్(1) స్మార్ట్ ఫోన్’ను ముందస్తుగా ఆర్డర్ చేస్తే మీకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీ-ఆర్డర్ కస్టమర్ల కోసం 8 జీబీ/128 జీబీ మొబైల్ ధర (రూ. 31,999), 8 జీబీ/ 256 జీబీ ధర (రూ.34,999), మరియు 12 జీబీ/ 256 జీబీ (రూ.37,999) వంటి ప్రారంభ ధరకు లభిస్తుంది. అందిస్తోంది. కేవలం నథింగ్ ఫోన్ (1) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Nothing Phone 1 Display
నథింగ్ ఫోన్(1) అల్యూమినియం ఫ్రేమ్’తో పాటు ముందు మరియు వెనక రెండింటిలోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 గ్లాస్ బాడీ డిజైన్ కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, 5జీ సపోర్ట్ తో పాటు ఛార్జింగ్ చేయడానికి యుఎస్ బి టైప్-సీ పోర్ట్ ఉంది. దీనిలో హెడ్ ఫోన్ జాక్. ఇది IP53 స్ప్లాష్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో 2400×1080-పిక్సెల్ రిజల్యూషన్తో 402 పీపీఐతో వస్తుంది.
Nothing Phone 1 Camera and Processor
కెమెరా వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్, ƒ/1.88 అపెర్చర్, OIS & EIS ఇమేజ్ స్టెబిలైజేషన్’తో పాటు 50 MP అల్ట్రా వైడ్ శామ్సంగ్ JN1 సెన్సార్తో ƒ /2.2 ద్వారం, EIS ఇమేజ్ స్టెబిలైజేషన్, మాక్రో (4 సెంటీమీటర్లు) మరియు HDR తో డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ముందువైపు, 16 MP సోనీ IMX471 సెన్సార్ తో ƒ/2.45 30 fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ గల సెల్ఫీ కెమెరా ఉంది. నథింగ్ ఫోన్ (1) క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ టీఎమ్ 778G+ చిప్ సెట్ కలిగి ఉంది.