TRACK Your FRIENDS LOCATION on Google Maps: ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రజల పనులు సులువుగా మారిందనే చెప్పాలి. చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు తినే తిండి నుంచి, ధరించే దుస్తులు ఇలా ఏదైనా సరే మన ముందుకే వస్తున్నాయి. ఇలా ఒక్కటేంటి ఎన్నో రకాలు ఉపయోగాలను మనం చూస్తునే ఉన్నాం. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఎందుకంటే కొందరు మంచిగా ఉపయోగించే అదే టెక్నాలజీని మరి కొంతమంది చెడుకు కూడా వాడుతున్నారు. అలాంటి ఫీచర్ గురించి మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఓ ఫీచర్ వల్ల వ్యక్తులు ఎక్కడ ఉన్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే సులువుగా ట్రాక్ చేయవచ్చు. దీన్ని ఈ టెక్నాలజీని కొందరు మంచికి మరికొందరు చెడుకి కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ ట్రాకింగ్ ఎలా జరుగుతుందో ఓ సారి లుక్కేద్దాం!
గూగుల్ మ్యాప్స్‌లో మరో వ్యక్తి లొకేషన్ ట్రాక్ చేయండి ఇలా!
మనం ఏ ప్రదేశానికైనా వెళ్లాలన్నా, తెలుసుకోవాలన్నా వెంటనే మన చూపు గూగుల్ మ్యాప్స్ వైపు మళ్లుతుంది. అంతేనా మన ఇంట్లో వారిని ట్రాకింగ్ చేయాలంటే కూడా అదే దిక్కుగా మారింది. దీని ద్వారా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఈజీగా ట్రాక్ చేయవచ్చు. వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే దానికి ఎదుటి వ్యక్తి అనుమతి ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి లొకేషన్ ను ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకుందాం.
(ఇది కూడా చదవండి: Mahindra Unveils 5 Electric Cars: అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్.. మిగతా కంపెనీలకు గట్టి దెబ్బే)
ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయితే వాట్సప్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ట్రాక్ చేయవచ్చు. అదే ఐఫోన్, ఐపాడ్ అయితే గూగుల్ మ్యాప్స్ లో ట్రాక్ చేయాలనుకునే ఎదుటి వ్యక్తి జీమెయిల్ ఐడీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై గూగుల్ మ్యాప్స్‌లో మీ ప్రొపైల్ ను క్లిక్ చేసి ట్రాక్ చేయాలనుకునే వ్యక్తిని యాడ్ చేయాలి. తర్వాత షేర్ లోకేషన్ బటన్ ను క్లిక్ చేసి ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు, ఎంతసేపు అనే వివరాలను ఇవ్వాలి.
కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేయాలి. ట్రాకింగ్‌కు రెడీగా ఉన్నప్పుడు మీరు షేరింగ్ బటన్‌ను క్లిక్ చేస్తే మీరు సెలక్ట్ చేసుకున్న వ్యక్తులు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి వీలు కుదురుతుంది. ఇక్కడ వరకు ఓకే ఎందుకంటే ఇదంతా మన అనుమతితోనే జరుగుతుంది, లేదంటే ఇది జరిగే ఆస్కారం ఉండదు.
అయితే ఇక్కడే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొందరు ఈ ట్రిక్‌ని మంచికి కాకుండా చెడుగా కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అది కూడా మన అనుమతి లేకుండానే. ఎలా అంటే మన ఈమెయిల్‌కి లేదా ఫోన్‌కి మెసేజ్ రూపంలో నకిలీ లింక్‌లు పంపుతారు, వాటిని ఓపన్ చేయగానే మన డేటాతో మన ప్రైవెసీ కూడా వాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అందుకే తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఏ లింక్‌ని కూడా ఓపన్ చేయకుండా వెంటనే డెలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు.