Sunday, September 15, 2024
HomeBusinessSBI Contactless Debit Card Payments: ఎస్‌బీఐ డెబిట్ కార్డు కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ఎలా యాక్టివేట్...

SBI Contactless Debit Card Payments: ఎస్‌బీఐ డెబిట్ కార్డు కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ఎలా యాక్టివేట్ చేయాలి?

SBI Contactless Debit Card Payments in Telugu: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు మరో శుభవార్త తెలిపింది. సాధారణంగా షాపులో పాయింట్ ఆఫ్ సేల్(POS) మెషీన్లలో కార్డు స్వైప్ చేసి పేమెంట్స్ చేయాలంటే పిన్ నెంబర్ తప్పనిసరి. ఆన్‌లైన్ పేమెంట్స్ అయితే ఓటీపీ తప్పనిసరి. పీఓఎస్ మెషీన్లలో పిన్ నెంబర్ అవసరం లేకుండా పేమెంట్స్ చేయడానికి ఎస్‌బీఐ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్(Contactless Debit Card) అందిస్తోంది.

ఈ ఎస్‌బీఐ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులో అదనపు సంరక్షణ కోసం EMV చిప్ ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పీఓఎస్ మెషీన్‌కు దగ్గరగా కార్డు ట్యాప్ చేస్తే చాలు. ఆ తర్వాత పేమెంట్ జరిగిపోతుంది. ఈ పేమెంట్స్ చేయడానికి ఎస్‌బీఐ గ్లోబల్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ అందిస్తోంది. ఈ కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ యాక్టివేట్ చేసిన తర్వాత పీఓఎస్ టెర్మినల్‌లో ఈజీగా పేమెంట్స్ చేయొచ్చు.

కార్డు స్వైప్ చేయడం, పిన్ నెంబర్ ఎంటర్ చేయడం లాంటివి అవసరం లేకుండా క్షణాల్లో పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు షాపుల్లో ఉండే అన్ని పీఓఎస్ మెషీన్స్‌లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ స్వీకరించే ఫీచర్ ఉంది. చిన్నచిన్న పేమెంట్స్ చేసేవారికి ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరి మీ దగ్గర కూడా కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ ఉంటే ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు ఎలా పనిచేస్తుంది?

ఒక కస్టమర్ PoS టెర్మినల్ దగ్గరలో కాంటాక్ట్ లెస్ కార్డును వేవ్ చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ పేమెంట్ చేయవచ్చు. ఒక రోజులో గరిష్టంగా 5 కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. గరిష్టంగా రూ.5,000 వరకు మాత్రమే పేమెంట్స్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ లేకపోతే మీ బ్యాంక్ బ్రాంచ్‌లో అప్లై చేయాలి లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

- Advertisement -

ఎస్ఎంఎస్ ద్వారా ఎస్‌బీఐ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డును ఎలా ఎనేబుల్ చేయాలి?

  • ఎస్‌బీఐ వినియోగదారులు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి SWON NFC CCCCC ఫార్మాట్‌లో 09223966666 నెంబర్‌కు SMS పంపాలి.
  • ఆ తర్వాత డెబిట్ కార్డుకు కాంటాక్ట్‌లెస్ పేమెంట్ ఫీచర్ యాక్టీవ్ అవుతుంది.
  • CCCC/CCCCC అంటే డెబిట్ కార్డులోని చివరి4/5 అంకెలు అని అర్థం చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌లో కూడా కాంటాక్ట్‌లెస్ పేమెంట్ ఫీచర్ యాక్టీవేట్ చేయొచ్చు.

నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్‌బీఐ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డును ఎలా ఎనేబుల్ చేయాలి?

  • యూజర్ ఐడీ, పాస్ వర్డ్’తో https://www.onlinesbi.com లాగిన్ అవ్వండి
  • Select Menu – E-Services – ATM Card Services – ATM Card Limit/Channel/Usage Change ఎంచుకోండి
  • ఆ తర్వాత Select Account Number – Select Card Number – Select Services ఎంచుకోండి.
  • వినియోగ రకాన్ని మార్చండి – NFC Usage సెలెక్ట్ చేసుకోండి.
  • ఆ తర్వాత ఎనేబుల్ చేసి మరియు సబ్మిట్ నొక్కండి.

యోనో ఎస్‌బీఐ మొబైల్ యాప్ ద్వారా ఎస్‌బీఐ కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఎలా యాక్టివేట్ చేయాలి?

ఎస్‌బీఐ కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డ్ ఛార్జీలు ఎంత?

కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ తీసుకునేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ కార్డు ఎప్పుడూ మీ దగ్గరే ఉండేలా జాగ్రత్తపడాలి. ఎట్టిపరిస్థితుల్లో ఈ కార్డు ఎవరికీ ఇవ్వకూడదు. మీ డెబిట్ కార్డులో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ యాక్టివేట్ అయి ఉంటే, మీ కార్డు పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles