Sunday, November 3, 2024
HomeAutomobileMahindra Unveils 5 Electric Cars: అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్.. మిగతా కంపెనీలకు గట్టి...

Mahindra Unveils 5 Electric Cars: అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్.. మిగతా కంపెనీలకు గట్టి దెబ్బే

Mahindra Unveils 5 Electric Cars: అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్.. మిగతా కంపెనీలకు గట్టి దెబ్బేప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారం తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రెండు ఈవీ బ్రాండ్ల కింద ఐదు ఇ-ఎస్యూవీలను ఆవిష్కరించింది. ట్విన్ పీక్ లోగోతో ఐకానిక్ బ్రాండ్ ఎక్స్యూవీ మరియు బోర్న్ ఎలక్ట్రిక్ పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నట్లు సంస్థ పేర్కొంది. మహీంద్రా కంపెనీ చెందిన ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచ దిగ్గజ సంస్థలకు చెందిన వాటితో పోటీ పడనున్నాయి.

మహీంద్రా, తన ఈవీ ప్లాన్లను బహిర్గతం చేసింది. “బ్రాండ్, వరల్డ్ బెస్ట్ డిజైన్ & అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంటి మూడు అంశాలను కీలకం చేసుకొని ఎలక్ట్రిక్ ఎస్యువిలను తీసుకురావడం ద్వారా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో నాయకత్వం వహించడమే మహీంద్రా కంపెనీ విజన్” అని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మహీంద్రా కొత్త INGLO EV ప్లాట్ ఫారం మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ 5 ఎలక్ట్రిక్ వాహనాలను 2024 చివరి నాటికి తీసుకొని రాబోతుంది.

అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు

ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో దూసుకొని వెళ్ళడానికి మహీంద్రా కంపెనీ రెండు కొత్త బ్రాండ్లను ప్రత్యేకంగా ఆవిష్కరించింది. ఎక్స్యూవీ.ఈ8, ఎక్స్యూవీ.ఈ9, బీఈ.05, బీఈ.07, బీఈ.09 వంటి ఐదు ఈ-ఎస్యూవీలను కంపెనీ ఈ ఈవెంట్’లో ప్రదర్శించింది. మహీంద్రా తన కొత్త ఇ-ఎస్యూవీల కోసం లాంచ్ తేదీలను కూడా వెల్లడించింది. 2024 డిసెంబర్లో ఎక్స్యూవీ ఇ-8, తరువాత ఏప్రిల్ 2025-లో ఎక్స్యూవీ.ఇ9 తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు, దాని బీఈ బ్రాండెడ్ వాహనం బిఇ05 అక్టోబర్ 2025లో ప్రారంభమవుతుంది. ఇంకా బిఇ.07 అక్టోబర్ 2026న ప్రారంభం కానుంది. బిఇ.09 కోసం కంపెనీ ఎటువంటి లాంచ్ తేదీని వెల్లడించలేదు. ఈ అన్ని ఇ-ఎస్ యువిలు మహీంద్రా కొత్త హార్ట్ కోర్ డిజైన్ ఫిలాసఫీపై ఆధారపడి ఉంటాయి. ఇందులో కస్టమర్‌ ప్రాధాన్యతలకు సరిపడా రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి.

- Advertisement -

(ఇది కూడా చదవండి: Simple One Electric Scooter: అదిరిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్?)

ఎయిర్ కండిషనింగ్ కోసం వ్యక్తిగత వినియోగదారు సెట్టింగ్‌లు ప్రతి ప్రయాణీకుడు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి. స్పష్టమైన కనెక్టివిటీ ఫీచర్‌ల కారణంగా కస్టమర్లు.. కాల్స్‌, టెక్స్ట్‌లు, మ్యూజిక్‌, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్సెస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో లెదర్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఈ ఎస్యూవీ బ్యాటరీ సైజులు 60-80 కిలోవాట్ల మధ్య ఉంటాయి. 175 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జ్కు సపోర్ట్ చేస్తాయి. బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఛార్జ్ చేస్తుంది. డబ్ల్యుఎల్టిపి సైకిల్ కింద 80 కిలోవాట్ బ్యాటరీ 450 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ శ్రేణిని అందిస్తుందని మహీంద్రా పేర్కొంది.

కొత్త ఈ-ఎస్యూవీలు రియర్-డ్రైవ్తో పాటు ఆల్-వీల్-డ్రైవ్ సెటప్లు రెండింటిలోనూ వచ్చే అవకాశం ఉంది. ఇ-ఎస్యూవీ ఫ్రంట్ మోటార్ 109హెచ్పి మరియు 135ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుందని, వెనుక యూనిట్లు 286హెచ్పిపి మరియు 560ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తాయని కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles