EPF Contribution Rules: మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే, మీకు ఒక ముఖ్య విషయం. మీ పిఎఫ్ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయో లేదో గమనిస్తున్నారా?. ఎందుకంటే, ప్రతి నెల మీ కంపెనీ మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)ఖాతాలో జీతాన్ని బట్టి కొంత మొత్తాన్ని జమ చేస్తుంది. డబ్బులు మీ ఈపీఎఫ్ ఖాతాలో జమ అయితే ఎలాంటి సమస్య లేదు. జమ కాకపోతేనే సమస్య. చిన్న చిన్న కంపెనీలు ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలో జమ చేయకుండా ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో మనం ఇప్పుడు ఏమి చేయాలో తెలుసుకుందాం.
కంపెనీ ఎంత పిఎఫ్ జమ చేస్తుంది?
మీ ఈపీఎఫ్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ కావడం లేదని తెలిసిన వెంటనే ఈపీఎఫ్‌ఓకు ఫిర్యాదు చేయడం ద్వారా సకాలంలో మీరు మీ నగదుని పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ఆధారంగా, ఉద్యోగి, యజమాని ప్రతి నెలా ప్రాథమిక జీతంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ (ప్రాథమిక జీతం+DA)లో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. ఉద్యోగి జమ చేసే మొత్తానికి సమానంగా కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. కంపెనీ జమ చేసే వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద, మిగిలిన 3.67 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది.
ఫీఎఫ్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడం ఎలా..?
ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో లాగిన్ చేయడం ద్వారా ప్రతి నెలా వారి పీఎఫ్ ఖాతాలోకి జమ చేసిన డిపాజిట్లను కూడా చెక్ చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే ఏమి చేయాలి?
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఒక వేళ యజమాని ఉద్యోగి ఖాతాలో పీఎఫ్ ఖాతాలో నగదు జమ చేయకపోతే ? కొన్ని సందర్భాలలో సంస్థలు పీఎఫ్ మొత్తాన్ని డిపాజిట్ చేయవు. ఇలాంటి సందర్భాలలో ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో ఇంకా డిపాజిట్ కాలేదని employeesfeedback@epfindia.gov.inకి ఫిర్యాదు చేయొచ్చు.
ఈపీఎఫ్ఓ నిబంధనలు ఏం చేప్తున్నాయంటే?
- ఈపీఎఫ్‌కి సంబంధించి ఉద్యోగి జీతంలోని నెలవారీ తగ్గింపులను యజమాని తప్పనిసరిగా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి.
- యజమాని ప్రతి నెల ఉద్యోగికి చెల్లించిన జీతం నుంచి 15 రోజులలోపు EPF నగదుని పీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- అయినప్పటికీ, చాలా మంది యజమానులు కొన్నిసార్లు పీఎఫ్ మొత్తాన్ని సకాలంలో డిపాజిట్ చేయకుండా కొందరు, పూర్తిగా డిపాజిట్ చేయకుండా మరికొందరు నిబంధనలను ఉల్లఘిస్తున్నారు.
- ఇటువంటి యజమానులపై ఉద్యోగులు ఫీర్యాదుతో చేయవచ్చు.
- ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత, రిటైర్‌మెంట్ ఫండ్ రెగ్యులేటరీ సంస్థ యజమానిపై విచారణ చేస్తుంది.
- ఈపీఎఫ్ మొత్తాన్ని మినహాయించినప్పటికీ డిపాజిట్ చేయలేదని విచారణలో తేలితే చట్టపరమైన చర్యలు యజమానిపై తీసుకుంటారు.
- EPFO అధికారుల ఫీఎఫ్ నగదు ఆలస్యంగా డిపాజిట్ చేసినందుకు వడ్డీని కూడా విధించే అవకాశంతో పాటు నగదుని రికవరీ కూడా చేస్తారు.
EPF చట్టం ప్రకారం, భవిష్యనిధికి మినహాయించబడిన మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే జరిమానా కూడా విధిస్తారు. ఇంతే కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సెక్షన్ 406, 409 కింద యజమానిపై EPFO అధికారులు పోలీసు ఫిర్యాదును కూడా దాఖలు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న పన్ను నిబంధనల ప్రకారం, యజమానులు PF ఖాతాలో సకాలంలో డిపాజిట్ చేయడంలో విఫలమైతే EPF కంట్రిబ్యూషన్‌లకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయలేరు.