Monday, September 16, 2024
HomeGovernmentPM Kisan e-KYC Update Online 2022: పీఎం కిసాన్ ఈ-కేవైసీ కోసం దరఖాస్తు చేసుకోండి...

PM Kisan e-KYC Update Online 2022: పీఎం కిసాన్ ఈ-కేవైసీ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా..?

PM Kisan 12th Installment, PM Kisan eKYC Update Online 2022 in Telugu: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని (PM Kisan Scheme) రైతులకు శుభవార్త. త్వరలో 12వ విడత నగదు విడుదల కానుందన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ విడత రానున్న రైతులు తప్పనిసరిగా పీఎం కిసాన్ ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి.

అయితే, ఈ పీఎం కిసాన్ ఈ-కేవైసీ(PM Kisan eKYC) గడువు జూలై 31న ముగిసిన సంగతి మన అందరికి తెలిసిందే. దీంతో గతంలో ఈ-కేవైసీ చేయాలనుకునే రైతులకు అవకాశం లేకుండా పోయింది. ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయని రైతులకు మరో అవకాశం లభించింది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం 2022 ఆగస్ట్ 31 వరకు పెంచింది.

దీంతో రైతులు ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి మరో కొన్ని రోజులు మాత్రమే ఉంది. పీఎం కిసాన్ పథకం డబ్బులు పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేయించడం తప్పనిసరి. ఇప్పటివరకు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయని రైతులు 2022 ఆగస్ట్ 31లోగా ఈ-కేవైసీ చేయొచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రాసెస్ సులువే. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ బేస్డ్ ఈ-కేవైసీ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ఆధార్-మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసీ విధానం:

  • మొదట పీఎం కిసాన్(pmkisan.gov.in) అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు ఫార్మర్ కార్నర్ కింద గాల ‘ఈ-కేవైసి’ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత ఆధార్ కార్డు నెంబరు, క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
  • మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ‘Get OTP’ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు, నిర్ధిష్ట ఫీల్డ్ ఓటీపీ నమోదు చేసిన తర్వాత “Submit For Auth” మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.
  • ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ పీఎమ్ కిసాన్ ఖాతాతో లింకు అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం లభిస్తుంది. రూ.2,000 చొప్పున మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఏటా రూ.6,000 జమ చేస్తోంది. ఇప్పటివరకు 11 విడతలు జమ అయ్యాయి. ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య 12వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల కానుంది. రైతులు ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తే 12వ ఇన్‌స్టాల్‌మెంట్ పొందొచ్చు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles