Home Loan Required Documents List: మన దేశంలో సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవడం అనేది సామాన్యుడి జీవిత కల. స్వంత ఇంటి కోసం పేద, మధ్య తరగతి జీవులు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ప్రతి నెల పొదుపు చేస్తూ ఉంటారు. కేవలం ఆ మొత్తంతో పాటు మిగతా మొత్తాన్ని బ్యాంకుల లేదా ఇతర సంస్థల నుంచి గృహ రుణం లేదా హోమ్ లోన్(Home Loan) తీసుకుంటారు.
గృహ రుణం లేదా హోమ్ లోన్(Home Loan) అనేది ఒక వ్యక్తి సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి పొందే సురక్షిత రుణం. నిర్మాణంలో ఉన్న లేదా డెవలపర్ నుంచి సిద్ధంగా ఉన్న ఇంటి కొనుగోలుకు ఈ లోన్ తీసుకోవచ్చు. కొత్త ఇంటిని కొనుగోలు చేయడం, ఒక స్థలంలో కొత్త ఇంటిని నిర్మించడం, ఇప్పటికే ఉన్న ఇంటిని రీమోడలింగ్ చేయడం.. వంటి వివిధ అవసరాలకు హోమ్ లోన్ తీసుకోవచ్చు.
(ఇది కూడా చదవండి: Open Plot Buying Tips: ఓపెన్ ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!)
అయితే, కొత్త ఇంటిని నిర్మించడానికి లేదా కొనుగోలు చేయడానికి గృహ రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులు కచ్చితంగా కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా అడుగుతాయి. ఆ డాక్యుమెంట్లు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
హోమ్ లోన్ కోసం కావాల్సిన ఆస్తి పత్రాలు
- సేల్ డీడ్ లేదా క్రయ దస్తావేజు, స్టాంప్ వేయబడిన అమ్మకపు ఒప్పందం
- హౌసింగ్ సొసైటీ లేదా బిల్డర్ నుంచి NOC
- భూమి / భూమి ఆదాయం / ఆదాయ విభాగం నుంచి స్వాధీన సర్టిఫికెట్ మరియు భూమి పన్ను రసీదు
- నిర్మాణ వ్యయం వివరణాత్మక అంచనా
- విక్రేత లేదా బిల్డర్’కి చేసిన చెల్లింపు వివరాలను తెలిపే బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా చెల్లింపు రసీదులు
- ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (కేవలం నిర్మాణం పూర్తి అయిన అపార్ట్‌మెంట్ల కోసం)
- బిల్డింగ్ పర్మిషన్ సర్టిఫికేట్ (ఇల్లు కట్టుకునే వారికోసం)
- ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్
హోమ్ లోన్ కోసం గుర్తింపు రుజువు (ఏదైనా ఒకటి)
- ఆధార్ కార్డు
- పాస్‍పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్స్
చిరునామా రుజువు (ఏదైనా ఒకటి)
- శాశ్వత చిరునామాతో పైన పేర్కొన్న ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి
- విద్యుత్ బిల్లు
- నీటి పన్ను
- ఆస్తి పన్ను రసీదు
- గ్యాస్ బిల్
- 5 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు
స్వయం ఉపాధి పొందే దరఖాస్తు దారులు అందజేయాల్సిన డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్?
- స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారులు తమ దరఖాస్తు కోసం తప్పనిసరిగా క్రింద పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితాను కచ్చితంగా బ్యాంకులో సమర్పించాలి.
- వ్యాపార ఉనికి తెలియజేసే లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్
పాన్ కార్డు
GST నమోదు సర్టిఫికేట్
ట్రేడ్ లైసెన్స్
పార్ట్నర్‌షిప్ డీడ్
షాప్ లేదా బిజినెస్ అగ్రీమెంట్ డాక్యుమెంట్
SEBI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
ROC రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
కనీసం 3 ఏళ్ల ఐటీఆర్ సర్టిఫికేట్
ఆర్థిక స్టేట్మెంట్లు (ఒక CA ద్వారా ఆడిట్ చేసింది)
- లాభనష్టములు తెలిపే ఒక అకౌంట్ స్టేట్‌మెంట్
- బ్యాలెన్స్ షీట్
- గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు అయితే తప్పనిసరిగా శాలరీ సర్టిఫికేట్’తో పాటు 2 ఏళ్ల ఫామ్-16 కావలసి ఉంటుంది.
- రైతులకు అయితే భూ విస్తీర్ణం బట్టి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
మీకు వచ్చే నెల ఆదాయంలో 60 శాతం వరకు ఈఎమ్ఐ ఉండే విధంగా బ్యాంకులు చూసుకుంటాయి అనే విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
ఇంకా ఏమైనా సహాయం కావాలంటే కింద మీ పేరు, మొబైల్ నెంబర్ కామెంట్ చేయండి.