Tuesday, December 3, 2024
HomeAutomobileభారతదేశంలో అతిపెద్ద గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్న ఓలా ఎలక్ట్రిక్!

భారతదేశంలో అతిపెద్ద గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్న ఓలా ఎలక్ట్రిక్!

Ola Electric 100 GWh Gigafactory: భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు దేశంలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో కంపెనీ తన సెల్ ఫ్యాక్టరీ మొదటి పిల్లర్‌ను భిగించి పనులను మొదలు పెట్టింది. Ola Gigafactory అత్యంత వేగవంతగా నిర్మించిన సెల్ ఫ్యాక్టరీలలో ఒకటిగా నిలువనుంది.

ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో మన దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుంది. సుమారు 115 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీ వచ్చే ఏడాది ప్రారంభంలో 5 GWh ప్రారంభ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభంకానుంది. ఆ తర్వాత దశలవారీగా దీనిని 100 GWhకి విస్తరించనున్నారు.

(ఇది కూడా చదవండి: Car Loans: కారు రుణాలపై వివిధ బ్యాంకుల విధిస్తున్న వడ్డీ రేట్లు ఎంతో తెలుసా..?)

ఈ ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఓలా గిగాఫ్యాక్టరీ భారతదేశంలోనే అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ అవుతుంది. పూర్తి సామర్ధ్యానికి విస్తరించిన తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద సెల్ తయారీ సౌకర్యాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది.

ఓలా వ్యవస్థాపకుడు, CEO భావిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ రోజు మేము మా గిగాఫ్యాక్టరీ మొదటి పిల్లర్‌ను ఇన్‌స్టాల్ చేయడం మాకు గర్వకారణం. భారతదేశ ఈవీ ప్రయాణంలో మా గిగాఫ్యాక్టరీ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది, భారతదేశాన్ని గ్లోబల్ ఈవీ హబ్‌గా మార్చడానికి ఇది దోహదపడుతుంది అని అన్నారు.

ఓలా సెల్ & బ్యాటరీ R&D పై భారీగా పెట్టుబడి పెట్టింది. బెంగుళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన సెల్ R&D సౌకర్యాలలో ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఓలా బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్ కోర్ సెల్ టెక్ డెవలప్‌మెంట్, బ్యాటరీ ఆవిష్కరణలకు మూలస్తంభంగా వ్యవహరిస్తోంది.

- Advertisement -

కంపెనీ తన తయారీ సామర్థ్యాలను 2Ws, 4Ws మరియు సెల్‌లలో విస్తరించడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఇటీవల ఒక MoU సంతకం చేసింది. ఎమ్ఒయులో భాగంగా, ఓలా ఒక EV హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది అధునాతన సెల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సౌకర్యాలు, విక్రేత & సరఫరాదారుల పార్కులు మరియు EVల కోసం అతిపెద్ద సహాయక పర్యావరణ వ్యవస్థను ఒకే ప్రదేశంలో ఉంచుతుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles