Friday, December 6, 2024
HomeGovernmentGruha Lakshmi Scheme Telangana: గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!

Gruha Lakshmi Scheme Telangana: గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!

Gruha Lakshmi Scheme Guidelines in Telangana: సొంత భూమి ఉండి ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇల్లు లేని నిరుపేదల కోసం ఈ పథకం తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.

గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల చొప్పున మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు పేర్కొంది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు తెలిపింది. అయితే, ఆ ఇంటిని మహిళ పేరు మీదటే మంజూరు చేయనున్నారు.

(ఇది కూడా చదవండి: Dharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా?)

ఈ పథకం అమలుకు జిల్లాల్లో కలెక్టర్‌లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రేటర్‌ కమిషనర్‌ నోడల్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం వాటా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని 3 దశల్లో లబ్దిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇంటి బేస్‌మెంట్‌ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు దశలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష రూపాయలు చెల్లిస్తారు.

గృహలక్ష్మి దరఖాస్తుదారుడికి కావాల్సిన అర్హతలు, మార్గదర్శకాలు..

  1. గృహలక్ష్మి ఇంటిని మహిళ పేరిటే మంజూరు చేస్తారు.
  2. ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఖాళీ జాగా ఉండాలి.
  3. లబ్ధిదారుడు లేదా ఆ కుటుంబ సభ్యుల పేరిట రేషన్ కార్డు ఉండాలి.
  4. లబ్దిదారుడు తనకు నచ్చిన డిజైన్‌లో ఇంటిని నిర్మించుకోవచ్చు.
  5. ఈ పథకం రెండు పడకల ఆర్సీసీ ఇంటి నిర్మాణానికే వర్తిస్తుంది.
  6. లబ్ధిదారుడు అదే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.
  7. ఆధార్‌/ఓటర్‌ ఐడీకార్డులు ఉండాలి. బ్యాంకులో ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలి.
  8. ఇప్పటికే ఆర్సీసీ రూఫ్‌తో కూడిన ఇల్లు ఉన్నా, జీవో 59 కింద లబ్ధి పొందినా ఈ పథకం వర్తించదు.
  9. ప్రతి నియోజకవర్గంలోని లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీ & మైనార్టీలు కలిపి 50 శాతం ఉండాలి.
  10. నిధుల విడుదల అధికారం కలెక్టర్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌దే.
  11. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ‘గృహలక్ష్మి’ లోగోను తప్పనిసరిగా కొత్త అతికించాలి.

గృహలక్ష్మి పథకం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే..!

గృహలక్ష్మి పథకం అమలంతా ఆన్‌లైన్‌లో చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పర్యవేక్షణలో గృహలక్ష్మి పేరుతో ప్రత్యేకంగా పోర్టల్‌ను, మెుబైల్ యాప్‌ను రూపొందించనుంది. జిల్లాల వారీగా ప్రజల నుంచి కలెక్టర్లు దరఖాస్తులను ఆహ్వానిస్తారు. అర్హుల జాబితాను కలెక్టర్లే ఫైనల్ చేయనున్నారు. దశల వారీగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆ ఇళ్లను మంజూరు చేస్తారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles