ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పీఎఫ్ ఖాతాలో వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి నగదు జమ చేయకపోతే అప్పుడు ఆ ఖాతా నిరుపయోగంగా మారిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి వడ్డీ జమ అవ్వడం కూడా ఆగిపోతుంది. అంటే, ఏ ఉద్యోగి అయిన పదవీ విరమరణ చేసిన మూడేళ్ల పాటు వడ్డీ జమ అవుతుంది అని గుర్తుంచుకోవాలి.
పదవీ విరమణ చేసిన తర్వాత ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలన్స్‌ను పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు అని గుర్తు పెట్టుకోండి. ఒకవేళ, మీరు ఒక సంస్థలో లేదా వివిద సంస్థలలో 5 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత మీరు ఉపసంహరించుకునే పీఎఫ్ బ్యాలన్స్ మొత్తంపై పన్ను ఉండకపోవడం ఒక మంచి అంశం.
అయితే, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి.. పదవి విరమణ(Retirement) చేసిన తర్వాత పీఎఫ్ బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకోకపోతే, ఆ నగదు మీద జమయ్యే వడ్డీ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. గనుక పీఎఫ్ ఖాతాలో బ్యాలన్స్‌ను ఉపసంహరించుకుని.. మంచి లాభాలను ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది.
Read More EPF Articles:
EPF Contribution Rules: మీ ఈపీఎఫ్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ కాకపోతే.. ఇలా చేయండి?
EDLI Benefits: ఈడీఎల్ఐ స్కీమ్‌కు ఎవరు అర్హులు, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
EPF: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ.. చెక్ చేసుకోండి ఇలా!
Transfer EPF Account: మీ పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఎలా..?
EPFO: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు శుభవార్త..! ఇక లక్షవరకు విత్ డ్రా