EPFO_Money

ఈపీఎఫ్‌ఓ తన చందాదారులకు శుభవార్త అందించింది. కరోనా తిరిగి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కష్టకాలంలో ఈపీఎఫ్ అకౌంట్‌ నుంచి లక్షరూపాయలను అడ్వాన్స్‌గా విత్‌ డ్రా చేసుకునేందుకు అవకాశాన్ని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) సంస్థ అవకాశం కల్పించింది.

దేశంలో కరోనా కేసుల పెరిగిపోతున్న తరుణంలో ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ హోల్డర్లు ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్‌ఓ సభ్యులు అకౌంట్‌ నుంచి రూ.1లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. చందాదారులు ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేకుండా లక్ష రూపాయల వరకు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. అయితే, కొన్ని నిబంధనలకు లోబడి పీఎఫ్‌ విత్‌ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేందుకు షరతులు:

  1. వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రి/సీజీహెచ్‌ఎస్‌ ప్యానెల్ ఆసుపత్రిలో చేరాలి.
  2. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే.., ఆస్పత్రిలో చేరేముందే విత్ డ్రా చేసుకోవచ్చు.
  3. పీఎఫ్‌ ఆఫీస్‌ వర్కింగ్‌ డే రోజు దరఖాస్తు చేస్తే, ఆ మరుసటి రోజే డబ్బు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది
  4. డబ్బును ఉద్యోగి పర్సనల్‌ అకౌంట్‌ లేదంటే ఆసుపత్రి బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది.

పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా చేసుకోండి ఇలా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here