Friday, November 22, 2024
HomeAutomobileEV NewsDot One Electric Scooter: లక్ష రూపాయలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా?

Dot One Electric Scooter: లక్ష రూపాయలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా?

Simple One Dot One Electric Scooter: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ సింపుల్ వన్ మార్కెట్లోకి ‘డాట్‌ వన్‌‘ పేరుతో మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. అయితే, లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ స్కూటర్‌ను రూ. 99,999కు తీసుకొని వచ్చినట్లు పేర్కొంది. అయితే ముందుస్తుగా బుక్‌ చేసుకున్న వారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆ తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది.

సింపుల్ వన్ డాట్‌ వన్‌ రేంజ్‌

ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి సంబంధించిన బుకింగ్స్‌ ప్రారంభించారు. త్వరలోనే స్కూటర్లను డెలివరీ కూడా చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. దీనిని ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 160 కిమీలు రేంజ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే వాతావరణ పరిస్థితులు, రోడ్డు ఆధారంగా కనీసం 151 కిమీ మైలేజ్‌ ఇస్తుందని సమాచారం.

సింపుల్ వన్ డాట్‌ వన్‌ బ్యాటరీ:

ఇక ఈ స్కూటర్‌లో 3.7 కిలో వాట్స్‌ కలిగిన బ్యాటరీ ఉంది. పికప్‌ విషయంలోనూ ఈ స్కూటర్‌ మంచి పర్ఫామెన్స్‌ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 2.77 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీల వరకు వేగాన్ని అందుకుంటుంది. ఇందులో అందించిన8.5 కిలో వాట్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌ 72 న్యూటన్‌ మీటర్‌ టార్క్‌ను అందిస్తుంది.

డాట్‌ వన్‌ స్కూటర్‌లో 35 లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ను అందించారు. ఇక డిజైన్ పరంగా కూడా ఈ స్కూటర్‌ను స్పోర్టివ్‌ లుక్‌లో తీసుకొచ్చారు. ఇందులో 8500 మోటర్‌ పవర్‌ను అందించారు. 105 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్తో దూసుకుపోతుంది. స్కూటీ 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ కావడానికి 3 గంటల 47 నిమిషాలు సమయం పడుతుంది.

(ఇది కూడా చదవండి: Top 5 Electric Scooters in India: ఇండియాలోని టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles