Friday, October 18, 2024
HomeBusinessFake GST Bill: నకిలీ జీఎస్​టీ బిల్లులను గుర్తించడం ఎలా? ఎలా రిపోర్ట్ చేయాలి?

Fake GST Bill: నకిలీ జీఎస్​టీ బిల్లులను గుర్తించడం ఎలా? ఎలా రిపోర్ట్ చేయాలి?

How to Check Fake GST Bill: దేశంలో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్​టీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పటికీ చాలా చోట్ల జీఎస్​టీ ఎగవేత, నకిలీ బిల్లుల ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. హోటల్, కొన్ని షోరూమ్స్, దుకాణాల్లో మీకు జీఎస్​టీ బిల్లులను ఇస్తుంటారు. అందులో కొన్ని నకిలీవి ఉంటాయి. అందుకే మోసాలను అరికట్టేందుకు, మీ నుంచి జీఎస్​టీ పేరుతో అదనపు సొమ్ము కొల్లగొట్టకుండా ఉండేందుకు ఆ బిల్లుల ప్రామాణికత తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నకిలీ జీఎస్​టీని గుర్తించడం ఎలా?

  • Verify GSTIN వస్తు, సేవలు అందించే వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రత్యేకమైన 15 అంకెల GSTINను కేటాయిస్తారు.
  • ఇందులో రాష్ట్ర కోడ్, సరఫదారుని పాన్ నంబర్, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది.
  • మీకు సప్లయర్​ బిల్లు ఇచ్చిన వెంటనే, అందులోని GSTINని చెక్ చేయాలి.
  • జీఎస్​టీ పోర్టల్​లో(https://services.gst.gov.in/services/searchtp) దానిని ఎంటర్ చేయాలి.
  • ఒక వేళ సదరు GSTIN సరైనదే అయితే, జీఎస్​టీ పోర్టల్​లో పన్ను చెల్లింపుదారు రకం, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ స్థానం (రాష్ట్రం), చట్టపరమైన పేరు, వ్యాపారం, వాణిజ్యం పేరు, UIN లేదా GSTIN స్టేటస్ కనిపిస్తాయి.
  • అప్పుడు మీకు ఇచ్చిన బిల్లు అసలైనదో? నకిలీదో? తేలిపోతుంది.

వెరిఫై ఇన్​వాయిస్ వాల్యూ

జీఎస్​టీ బిల్లులో మీరు కొనుగోలు చేసిన వస్తు, సేవల విలువ, దానిపై విధించిన పన్ను మొత్తం ఉంటుంది. అందుకే మీరు జీఎస్​టీ వెబ్​సైట్​లోని కాలిక్యులేటర్ ఓపెన్ చేసి, ఇన్​వాయిస్​లోని డబ్బులకు సరిపడా జీఎస్​టీ వేశారా? లేదా ఎక్కువ వసూలు చేస్తున్నారా? అనేది చెక్ చేసుకోవాలి. అలాగే జీఎస్​టీ బిల్లులో సప్లయర్ లేదా అతని అధీకృత ప్రతినిధి సంతకం ఉండాలి. బిల్లుపై కనిపించే ఆ సంతకం జీఎస్​టీ పోర్టల్​లో ఉన్న సంతకంతో సరిపోలుతుందో లేదో తనిఖీ చేయాలి.

ట్యాక్స్ పేమెంట్ స్టేటస్

చివరగా కస్టమర్లు జీఎస్​టీ పోర్టల్‌లోని సప్లయర్​ టాక్స్ పేమెంట్ స్టేటస్​ను కూడా చెక్ చేయవచ్చు. ఒక వేళ జీఎస్​టీ పోర్టల్​లో సదరు సప్లయర్​ వివరాలు కనిపించలేదంటే, అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలుసుకోండి.

ఫిర్యాదు చేయండిలా!

ఒకవేళ మీరు నకిలీ జీఎస్​టీ బిల్లును గుర్తించినట్లైతే నేరుగా జీఎస్​టీ పోర్టల్​​లోనే ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే పోర్టల్​​లోని టోల్​-ఫ్రీ నంబర్​కు 1800-103-4786 ఫోన్ చేసి రిపోర్ట్ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles