Wednesday, October 16, 2024
HomeBusinessఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్: వీటిలో ఏది మంచి...

ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్: వీటిలో ఏది మంచి స్కీమ్?

Key Difference of UPS vs NPS vs OPS Schemes: చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పెన్షన్ స్కీమ్(NPS) సవరిండచం లేదంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్(OPS)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. కంబైన్డ్ పెన్షన్ స్కీం స్థానంలో కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీం(UPS)ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త పెన్షన్ స్కీంలో కనీసం 25ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ రానుంది. అయితే కనీస పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సందర్భంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) మధ్య తేడాలను పరిశీలిద్దాం.

ఓల్డ్ పెన్షన్ పథకం(OPS):

ఓపీఎస్ కింద ఉద్యోగి పదవీ విరమణ సమయంలో అప్పటి వరకు సదరు ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే.. అలా పని చేస్తూ తీసుకుంటున్న నెలవారి జీతంలో ఉదా రూ.1లక్షలు తీసుకుంటుంటే అందులో సగం రూ.50వేలు అందిస్తుంది.

ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు వారి జీతంలో కొంత భాగాన్ని జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF)కి తరలించాల్సి ఉంటుంది. అలా ఉద్యోగి రిటైర్మెంట్ కాకముందు జీపీఎఫ్ కు తరలించిన మొత్తంతో పాటు వడ్డీని సైతం రిటైర్మెంట్ సమయంలో పొందవచ్చు.

- Advertisement -
  • ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు రూ. 20 లక్షల వరకు గ్రాట్యుటీ మొత్తాన్ని పొందేందుకు అర్హులు.
  • ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద చెల్లింపులు మొత్తం ప్రభుత్వ ట్రెజరరీ ద్వారా జరుగుతాయి. పెన్షన్ సైతం ప్రభుత్వ నిధుల నుంచి ఉద్యోగికి అందుతాయి.
  • పదవీ విరమణ పొందిన ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్ అందుతుంది.
  • ఓల్డ్ పెన్షన్ స్కీమ కింద ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత వారికి అందించే పెన్షన్ ను ప్రభుత్వమే అందిస్తుంది. ఉద్యోగి విధులు నిర్వహించే సమయంలో జీతంలో ఎలాంటి కోత పెట్టదు.
  • ఓల్డ్ పెన్షన్ స్కీమ కింద ప్రతి ఆరు నెలలకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)ని కేంద్రం అందిస్తుంది. ఈ డీఏ దేశ ఆర్ధిక స్థితి గతుల ఆధారంగా చెల్లింపులు ఉంటాయి.

నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS):

నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగి బేసిక్ శాలరీలో 10 శాతం, డియర్‌నెస్ అలవెన్స్ (DA)లో కొంత మొత్తాన్ని రీటైర్ మెంట్ తర్వాత అందించే పెన్షన్ కి తరలిస్తారు. పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందాలంటే ఎన్‌పీఎస్ ఫండ్‌లో 40 శాతం తప్పనిసరిగా యాన్యుటీలలో పెట్టుబడి పెట్టాలి. అంటే ఎల్ఐసీ వంటి ఇన్స్యూరెన్స్ కంపెనీ పాలసీల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

నేషనల్ పెన్షన్ స్కీమ్ ని స్టాక్ మార్కెట్ కి అనుసంధానం చేసింది. దీంతో పదవీ విరమణ తర్వాత సదరు ఉద్యోగి నెలవారీ చెల్లించే పెన్షన్ మొత్తం మారిపోతుంది. స్థిరంగా ఉండదు. స్టాక్ మార్కెట్ లోని నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫండ్ పనితీరు ఆధారంగా పెన్షన్ అందుతుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వలే కాకుండా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పదవీ విరమణ తర్వాత అందించే డీయర్ నెస్ అలవెన్స్ ఉండదు.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS):

వచ్చే ఏడాది జనవరి 1,2025 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా సిఫార్స్ చేసిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఉన్న ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లోకి మారిపోవచ్చు. ఈపెన్షన్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేరొచ్చు.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఉద్యోగులు రీటైర్మెంట్ తర్వాత.. ఉద్యోగులు పదవీ విమరణకు ముందు 12 నెలల కాలంలో ఎంత మొత్తంలో బేసిక్ శాలరీ పొందారో ఆ మొత్తం బేసిక్ శాలరీలో 50 శాతం పెన్షన్ రూపంలో పొందవచ్చు.

  • పైన పేర్కొన్నట్లుగా సగం పెన్షన్ రావాలంటే తప్పని సరిగా 25ఏళ్ల పాటు సర్వీసు అందించాల్సి ఉంటుంది.
  • పెన్షన్ అర్హత సాధించాలంటే ప్రతి ఒక్క ఉద్యోగి కనీస సర్వీసు 10ఏళ్లకు తగ్గ కూడదు.
  • ఒకవేళ తక్కువ సర్వీస్ పీరియడ్ ఉన్నవారికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద నెలకు కనీస పెన్షన్ రూ. 10,000 చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
  • ఉద్యోగి పదవీ విరమణకు ముందు ఉద్యోగి మరణిస్తే పెన్షన్‌లో 60 శాతం జీవిత భాగస్వామి పొందవచ్చు.
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్యారెంటీ కనీస పెన్షన్ పరిహారం మొత్తం డియర్‌నెస్ అలవెన్స్‌కు సమానమైన ద్రవ్యోల్బణ రేట్ల ప్రకారం అందిస్తుంది.
  • గ్రాట్యుటీకి అదనంగా పదవీ విరమణ చేసిన రోజున ఒకేసారి మొత్తం చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది. ఇది నెల వేతన మొత్తంలో వేతనం ప్లస్ డీఏని 10వ వంతున లెక్కగట్టి చెల్లిస్తారు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles