Sunday, April 21, 2024
HomeAutomobileఅదిరిపోయిన రియల్ 5టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రేంజ్ కూడా అదుర్స్!

అదిరిపోయిన రియల్ 5టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రేంజ్ కూడా అదుర్స్!

Loncin Real 5T Electric Scooter: ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఏలక్ట్రిక్ స్కూటర్ల(Electric Scooter) జోరు కొనసాగుతుంది అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశంలో రోజు రోజుకి వీటి వినియోగం పెరుగుతుంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ విభాగంలో వాహనాలను తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. అలాగే, కొత్త కొత్త స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి.

కేవలం దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో చాలా కంపెనీలు ఈ రంగంలో పోటీ పడుతున్నాయి. చైనా దేశానికి చెందిన లోన్సిన్ మెటార్‌సైకిల్స్ కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు రియల్ 5టీ. కంపెనీ నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన హీరో తొలి విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ ఎంతో తెలుసా?)

రియల్ 5టీ ఈ-స్కూటర్‌ టాప్ స్పీడ్

బీఎండబ్ల్యూ ఎఫ్850 జీఎస్, ఎఫ్ 900 ఆర్ వాహనాలకు ఇంజిన్లను తయారు చేస్తున్న ఈ కంపెనీనే ఇప్పుడు నేరుగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. రియల్ 5టీ స్కూటర్ చూడటానికి అదిరిపోయే డిజైన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ 124 సీసీ పెట్రోల్ స్కూటర్‌తో సమానం అని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ ఔట్‌పుట్ 15 బీహెచ్‌పీ, దీని టాప్ స్పీడ్ గంటకు 115 కిలోమీటర్లు.

రియల్ 5టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ రేంజ్

ఇందులో రెండు 2.4 కేడబ్ల్యూహెచ్ గల లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఈ రియల్ 5టీ స్కూటర్‌ను ఒక్కసారి చార్జింగ్ పెడితే 240 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్‌ చార్జింగ్‌ కోసం కంపెనీ 1.84 కేడబ్ల్యూ చార్జర్ అందిస్తోంది. ఈ చార్జర్ ద్వారా స్కూటర్‌కు కేవలం 2 గంటల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతుంది.

అలాగే ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ వార్నింగ్ లైట్స్, చార్జింగ్ పోర్ట్, రివర్స్ గేర్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉంటే, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంది. దీని ధర సుమారు రూ. 2 లక్షల పైనా ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles