Tata Nano Electric Car
Tata Nano Electric Car

Tata Nano EV Price in Telugu: టాటా మోటార్స్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన కార్లలో టాటా నానో కారు(TATA Nano Car) ఒకటి. అలాంటి ఈ కారుకి ప్రజాదరణ తక్కువ కావడంతో ఆటోమోబైల్ మార్కెట్లో నిలబడ లేకపోయింది. కానీ, ఇప్పటికీ టాటా నానో పేరు తెలియని వారు ఉండరు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. దీనికి గతంలో ఎంత క్రేజ్ ఉంది అనేది.

బైక్ మీద నలుగురు వెళ్లడం కష్టంగా ఉండి ఒక కారు కొనుక్కోవాలి అని కలలు కనే మధ్యతరగతి కుటుంబాల కోసం రతన్ టాటా తీసుకొచ్చిన బడ్జెట్ కారు ఈ నానో కారు. 2008లో వచ్చిన ఈ కార్లకి మొదట్లో డిమాండ్ బాగా ఉండేది. అయితే రాను రాను ప్రజాదరణ తగ్గడంతో 2018లో నానో కార్ల తయారీని టాటా మోటార్స్ కంపెనీ నిలిపివేసింది. దీంతో చాలా మంది సామాన్య ప్రజానీకం నిరుత్సాహపడ్డారు.

టాటా నానో ఎలక్ట్రిక్ కారు:

నానో కారు తిరిగి తీసుకొని వస్తే బాగుండు అని చాలా మంది అనుకునే వారు. అయితే, అలాంటి వారికి టాటా కంపెనీ ఒక తీపికబురు అందించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం త్వరలో నానో కారుని తిరిగి మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈసారి తీసుకొని రాబోయే టాటా నానో ఎలక్ట్రిక్ కారులో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా విద్యుత్ వాహనాలపై ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో నానో కారు(Tata Nano Electric Car)ని ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకొస్తే.. సామాన్య ప్రజానీకానికి మంచి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే నానో ఈవీని అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ కార్ల విక్రయాల్లో టాటా కంపెనీ వాటా 80 శాతంగా ఉంది.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన హీరో తొలి విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ ఎంతో తెలుసా?)

నెక్సాన్ ఈవీ, టిగార్ ఈవీ, టియాగో ఈవీ వాహనాల విక్రయాలతో టాటానే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో టాటా కంపెనీ భవిష్యత్తులో మరిన్ని కార్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో మిడిల్ క్లాస్ వారికోసం బడ్జెట్ కారుని ఎలక్ట్రిక్ వేరియెంట్లో తీసుకురావాలని యోచిస్తుంది.

నానో ఎలక్ట్రిక్ కారు రేంజ్ ఎంత?

అయితే పాత డిజైన్లో కాకుండా ప్రస్తుత ట్రెండ్’కి తగ్గట్టు డిజైన్ లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధునాతన ఫీచర్స్, సరికొత్త డ్యాష్ బోర్డుతో మరింత స్టైలిష్’గా నానో కారుని డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగిన 17 కిలో వాట్ హవర్ బ్యాటరీ, పవర్ ఫుల్ మోటార్’తో దీన్ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నానో ఎలక్ట్రిక్ కారు ధర ఎంత?

టాటా కంపెనీ విడుదల చేయబోతున్న 10 ఈవీ కార్లలో నానో ఎలక్ట్రిక్ కారు కూడా ఒకటి. టాటా తయారుచేస్తున్న 10 ఈవీ మోడల్స్ రాబోయే 5 ఏళ్లలో లాంచ్ అవ్వనున్నాయి. అయితే నానో కారు ఈ లోపే వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నానో కారు ధర కూడా రూ. 2 నుంచి రూ. 3 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్లో గనుక టాటా కంపెనీ కారు అందిస్తే.. మిడిల్ క్లాస్ వారికి శుభవార్తే అని చెప్పుకోవాలి.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్.. మిగతా కంపెనీలకు గట్టి దెబ్బే)

ప్రస్తుత ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్ ధరలతో ఎలాంటి బాధ ఉండదు. ఎంచక్కా కుటుంబంతో కలిసి కారులో ఎంజాయ్ చేయవచ్చు. మిడిల్ క్లాస్ వారికి చౌక ధరకే కారు అందించాలన్న రతన్ టాటా సంకల్పం కూడా నెరవేరుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నానో కారు అవసరం ఈ మిడిల్ క్లాస్ వారికి ఉంది. అయితే టాటా మోటార్స్ ఈ కారు గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here