Saturday, October 12, 2024
HomeBusinessState Bank of India EMI: ఎస్‌బీఐ రుణగ్రహితలకు భారీ షాక్.. వడ్డీ రేట్లను పెంచిన...

State Bank of India EMI: ఎస్‌బీఐ రుణగ్రహితలకు భారీ షాక్.. వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్!

SBI Hikes MCLR Rates: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్(Marginal Cost of Funds Based Landing Rate) రేటును మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎంసీఎల్‌ఆర్‌ రేటు 20 బీపీఎస్‌ పాయింట్లు పెరిగింది. దీంతో ఎస్‌బీఐలో లోన్‌ తీసుకున్న రుణ గ్రహీతలపై మరింత భారం పడే అవకాశం ఉంది.

బాహ్య బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు(External Benchmark based Lending Rate), రెపో-లింక్డ్ లెండింగ్(Repo Linked Lending Rate) రేటును 50 బీపీఎస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 15 నుండి సవరించిన నుంచి అమలులోకి వచ్చాయి. ఓవర్‌నైట్ నుండి మూడు నెలల వరకు SBI MCLR రేటు 7.15 శాతం నుండి 7.35 శాతానికి పెరిగింది. ఆరు నెలల వ్యవధి రుణాల వడ్డీరేటు 7.45 శాతం నుండి 7.65 శాతానికి పెరిగింది. సంవత్సర పరిధి లోన్లపై 7.90 శాతం, రెండేళ్లు, మూడు సంవత్సరాల 8 శాతంగా ఉంచింది.

(ఇది కూడా చదవండి: SBI Whatsapp Banking Services: వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి ఇలా..?)

మూడు నెలల్లో మూడో పెంపు ఇది. ఇటీవల RBI రెపో రేటు పెంచిన నేపథ్యంలో SBI ఈ నిర్ణయం ప్రకటించింది. మరో వైపు హెచ్‌డీఎఫ్‌సీ( HDFC) ఎంసీఎల్‌ఆర్‌ని( MCLR)ని 5 – 10 బేసిస్ పాయింట్లు (bps) పెంచగా, అది ఆగస్ట్ 8 నుంచి అమలులోకి వచ్చింది, ఐడీఎఫ్‌సీ( IDFC) కూడా 5-15 (bps) పెంచుతూ సవరించింది. ద్రవ్యోల్సణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు తమ వడ్డీరేటు పెంచుతున్నాయి.

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్(MCLR) రేటు అంటే ఏమిటి?

ఎంసీఎల్‌ఆర్‌(MCLR-Marginal Cost of Funds Based Lending Rate -మార్జినల్‌ కాస్ట్‌ బేస్‌డ్‌ లెండింగ్‌ రేటు) రేటు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విధానాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకువచ్చింది. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఎంసీఎల్ఆర్ విధానాన్ని ఆర్బీఐ అమల్లోకి తీసుకువచ్చింది.

- Advertisement -

అంతకు ముందు అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఒక వడ్డీ రేటును నిర్ణయించేవి. బేస్‌ రేటు స్థానంలో ఎంసీఎల్‌ఆర్‌ను ఏప్రిల్‌ 2016 నుంచి బ్యాంకులు అమలు చేస్తున్నాయి. MCLR ఇప్పుడు క్రెడిట్‌లు మరియు గృహ రుణాలను పొడిగించడానికి బ్యాంకుల అంతర్గత బెంచ్‌మార్క్ రేటుగా మారింది . దీనిని ఫ్లోటింగ్ వడ్డీ రేటు విధానంగా కూడా పేర్కొనవచ్చు.

రెపో రేటు అంటే ఏంటి?

రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులు తమ స్వల్పకాలిక ఫండ్ అవసరాలను తీర్చుకోవడం కోసం ఆర్‌బీఐ నుంచి డబ్బును అప్పుగా తీసుకునే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles