ఎప్పుడెప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఓలా ఎలక్ట్రిక్ శుభవార్త అందించింది. ఎట్టకేలకు ఓలా స్కూటర్ బుకింగ్స్ మొదలు పెట్టింది. కంపెనీ చీఫ్ భవిష్ అగర్వాల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓలా స్కూటర్ బుకింగ్స్ మొదలైనట్లు ప్రకటన చేశారు. ఆ ట్వీట్ లో ఆయన ఇలా పేర్కొన్నారు.. “భారతదేశంలో నేడు ఈవీ విప్లవం ప్రారంభమైంది! ఓలా స్కూటర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి! ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ప్రపంచ నాయకుడిగా ఎదగగల సామర్ధ్యం భారతదేశం కలిగి ఉంది. దానికి నాయకత్వం వహించడం మాకు గర్వంగా ఉంది! #JoinTheRevolution @olaelectric” అని పోస్టు చేశారు.
ధర ఎంత?
ఆసక్తి గల ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు ఈ స్కూటర్ ను ₹499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకోవడం వల్ల అందరికంటే ముందు స్కూటర్ పొందే అవకాశం ఉంటుంది. మీకు నచ్చకుంటే చెల్లించిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. చాలా ప్రశ్నలకు కంపెనీ తన పోర్టల్ సమాధానం ఇచ్చింది. దీని ధర సుమారు రూ. ఒక లక్ష నుంచి రూ.1,50,000 ఉండే అవకాశం ఉంది. ఇంతకు ముందు పోస్టులలో అగర్వాల్ ఈ కొత్త స్కూటర్ యొక్క కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేశారు. కొత్త ఈ-స్కూటర్ “సెగ్మెంట్-బెస్ట్” ఫీచర్లతో వస్తుంది. ఓలా స్కూటర్ లో బెస్ట్ ఇన్ క్లాస్ బూట్ స్పేస్ కూడా ఉంది.
ఈ స్కూటర్ కీ సహాయం లేకుండానే యాప్ ద్వారా స్టార్ట్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎర్గోనమిక్ సీటింగ్ తో వస్తుందని ఓలా పేర్కొంది. టీజర్ వీడియోలో కంపెనీ “మెరుగైన కార్నరింగ్”తో పాటు “క్లాస్-లీడింగ్ యాక్సిలరేషన్” కూడా లభిస్తుందని పేర్కొంది. డిజైన్ పరంగా చూస్తే ఈ స్కూటర్ స్లిమ్ గా ఉంది. దీని చుట్టూ ఉన్న ఎల్ఈడీడీఆర్ఎల్ ట్విన్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ దీనికి ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ డ్రైవింగ్ రేంజ్ గురుంచి అధికారిక గణాంకాలను వెల్లడించలేదు. అయితే, దీనిని 50 శాతం ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ సుమారుగా ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు మనం సురక్షితంగా ప్రయాణించవచ్చు.
Support Tech Patashala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.