Monday, October 14, 2024
HomeGovernment42 లక్షల మంది పీఎం కిసాన్ రైతులకు కేంద్రం షాక్!

42 లక్షల మంది పీఎం కిసాన్ రైతులకు కేంద్రం షాక్!

PM-KISAN: పీఎం కిసాన్ రైతులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పీఎం-కిసాన్ పథకం కింద అనర్హులైన 42 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలో జమ చేసిన సుమారు రూ.3,000 కోట్లను రికవరీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిది పథకం కింద కేంద్రం ప్రతి ఏడాది రూ.6,000ను దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాలలో మూడు సమాన వాయిదాలలో జమ చేస్తుంది. అయితే, ఈ పథకానికి రైతులు అర్హత సాధించాలంటే కొన్ని అర్హతా ప్రమాణాలు ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా అనర్హుల రైతుల సంఖ్య

పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందిన 42.16 లక్షల మంది అనర్హులైన రైతుల నుంచి రూ.2,992 కోట్లు రికవరీ చేయాల్సి ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. పీఎం కిసాన్ నుంచి అక్రమంగా నగదు పొందిన రైతుల గరిష్ట సంఖ్య, రికవరీ చేయాల్సిన నగదు రాష్ట్రాల వారీగా ఇలా ఉంది

  • అస్సాంలోని 8.35 లక్షల రైతుల నుంచి రూ.554 కోట్లు
  • తమిళనాడులోని 7.22 లక్షల రైతుల నుంచి రూ.340 కోట్లు
  • పంజాబ్ లోని 5.62 లక్షల రైతుల నుంచి రూ.437 కోట్లు
  • మహారాష్ట్రలోని 4.45 లక్షల రైతుల నుంచి రూ.358 కోట్లు
  • ఉత్తరప్రదేశ్ లోని 2.65 లక్షల రైతుల నుంచి రూ.258 కోట్లు
  • గుజరాత్ లోని 2.36 లక్షల రైతుల నుంచి రూ.220 కోట్లు

“ఆధార్ డేటా, పీఎఫ్ఎంఎస్ డేటా, ఆదాయపు పన్ను డేటాబేస్ ఆధారంగా అధికారులు లబ్ధిదారుల డేటాను నిరంతరం చెక్ చేస్తారు. అయితే, వెరిఫికేషన్ సమయంలో ఈ పథకం కింద కొంతమంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులతో పాటు కొంతమంది అనర్హులైన లబ్ధిదారులకు నగదు బదిలీ చేసినట్లు” తోమర్ పార్లమెంటుకు తెలిపారు. పీఎం కిసాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుందని “అర్హులైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడానికి” ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలా రాష్ట్రాలు అనర్హులైన రైతుల నుంచి డబ్బులను రికవరీ చేయడానికి నోటీసులు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

- Advertisement -

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles