Friday, November 8, 2024
HomeAutomobileSimple One Electric Scooter: అదిరిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్?

Simple One Electric Scooter: అదిరిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్?

Simple One Electric Scooter Specifications in Telugu: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ సింపుల్ ఎనర్జీ(Simple Energy) అదిరిపోయే శుభవార్త తెలిపింది. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న లాంచ్ చేసిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌(Simple One Electric Scooter)ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా, స్కూటర్ బుక్ చేసుకున్న వాహనదారులకు టెస్టింగ్ రైడింగ్ కోసం అవకాశం కల్పించింది. ఈ స్కూటర్‌కి చెందిన కొన్ని రియల్ వరల్డ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఈ స్పెసిఫికేషన్స్, లాంచ్ సమయంలో పేర్కొన్న స్పెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉన్నప్పటికీ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి చెందిన వాస్తవ స్పెసిఫికేషన్స్ గురుంచి తెలుసుకుందాం.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్ ఎంతో తెలుసా?

ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One Electric Scooter అని కంపెనీ అధికారి లాంచ్ సమయంలో తెలిపారు. రియల్ వరల్డ్ రేంజ్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ఎకో మోడ్(45 KMPH వరకు)లో 87 శాతం బ్యాటరీ శాతం ఉన్నప్పుడు 174 కిమీ వరకు వెళ్లనున్నట్లు చూపించింది. 100 శాతం బ్యాటరీ ఉంటే గనుక ఎకో మోడ్‌లో 190 కిమీ – 200 కిమీ రేంజ్ ఇవ్వనుంది. అయితే, ఇందులో చైన్ డ్రైవ్ మోటార్ కాకుండా బెల్ట్ డ్రైవ్ ఉంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి?

  • ఇందులో నాలుగు మోడ్స్ ఉన్నాయి. అవి
  • 1) సోనిక్ మోడ్ – ఈ మోడ్‌లో గరిష్టంగా 105 కిమీ వేగంతో వెళ్తే కనీసం మీకు 80 కిమీ వరకు రేంజ్ రానుంది.
  • 2) డ్యాష్ మోడ్ – ఈ మోడ్‌లో గరిష్టంగా 85 కిమీ వేగంతో వెళ్తే కనీసం మీకు 100 కిమీ వరకు రేంజ్ రానుంది.
  • 3) రైడ్ మోడ్ – ఈ మోడ్‌లో గరిష్టంగా 65 కిమీ వేగంతో వెళ్తే కనీసం మీకు 150 కిమీ వరకు రేంజ్ రానుంది.
  • 4) ఎకో మోడ్‌ – ఈ మోడ్‌లో గరిష్టంగా 45 కిమీ వేగంతో వెళ్తే కనీసం మీకు 190 – 200 కిమీ వరకు రేంజ్ రానుంది.

(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో లీకైన కొత్త ఏథర్ ఎనర్జీ ఈ-స్కూటర్ వివరాలు.. రేంజ్ ఎంతో తెలుసా?)

అయితే, మీరు వెళ్లే వేగం బట్టి రేంజ్ అనేది మారుతుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ Simple One Electric Scooter బ్రాంజ్ బ్లాక్, అజ్యూరే వైట్, బ్రెంజ్ వైట్, నమ్మ రెడ్ వంటి రంగులలో లభ్యం అవుతుంది. కస్టమర్లు ఈ స్కూటర్ కోసం రూ.1947 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టం వేగం గంటకు 105 కిలోమీటర్లు.

- Advertisement -

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టం వేగం గంటకు 105 కిలోమీటర్లు. పైన పేర్కొన్నట్లు స్కూటర్ వేగం అనేది మోడ్‌ని బట్టి మారుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ

ఈ బైక్ 4.8 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఐపీ67 వాటర్, దూలి నిరోధకత గల బ్యాటరీ. ఇది 72 ఎన్ఏం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ బ్యాటరీలో పవర్ ఉత్పత్తి చేసే 27,000 సెల్స్ ఉన్నాయి. కొత్తగా లాంఛ్ చేసిన స్కూటర్లలో 7 ఇంచ్ డిస్ప్లే, 4జీ, బ్లూటూత్ 5.2కు సపోర్ట్ చేస్తుంది. ఈ బైక్ 30 లీటర్ల బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని సుల్తాన్ బూల్ బూల్ పక్షిని ప్రేరణగా తీసుకొని తయారు చేసినట్లు తెలుస్తుంది. అందరిని ఎక్కువగా ఆకట్టుకునేది ఈ స్కూటర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ మీద ఎక్కువ భారం పడకుండా ఉండటానికి ఏరోడైనమిక్ రూపంలో దీనిని తీర్చిదిద్దారు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర

ఈ సింపుల్ వన్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,999గా ఉంది. వివిద రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీతో ధర ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. దీనిలో ఏకొ, రైడ్, డ్యాష్, సోనిక్ అనే నాలుగు మోడులు ఉన్నాయి. ఇందులో రెండూ బ్యాటరీలు ఉంటాయి. ఒకటి పోర్టబుల్ బ్యాటరీ మరొకటి నాన్ పోర్టబుల్ బ్యాటరీ. ఈ 7 కేజీల పోర్టబుల్ బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయడానికి 75 నిమిషల సమయం పడితే, మొత్తం బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు విడుదల కానుంది?

ఈ స్కూటర్‌ని ఈ ఏడాది ఆగస్టు – అక్టోబర్ మధ్య కాలంలో మార్కెట్లోకి తీసుకొని రానున్నట్లు సమాచారం. అలాగే,13 రాష్ట్రాల్లో ఛార్జింగ్ నెట్ వర్క్ నిర్మించాలని సింపుల్ ఎనర్జీ యోచిస్తోంది. ఈ రాష్ట్రాల్లో సుమారు 300కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో లీకైన కొత్త ఏథర్ ఎనర్జీ ఈ-స్కూటర్ వివరాలు.. రేంజ్ ఎంతో తెలుసా?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles