Friday, April 19, 2024
HomeBusinessCredit Card Withdrawal Charges: క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా?

Credit Card Withdrawal Charges: క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా?

Credit Card ATM Withdrawal Charges: క్రెడిట్ కార్డును వినియోగించి ఏటీఎం ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఆప్షన్ ఉంది కదా అని మీరు గనుక క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తే మీరు భారీగా నష్టపోయే చాన్స్ ఉంది. అది ఏ విధంగా తెలుసుకోండి..?

మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్’తో క్రెడిట్ లిమిట్’లో ఏటీఎం నుంచి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకులు మీకు అవకాశం కల్పిస్తాయి. ఆ కార్డ్’లను జారీ చేసే బ్యాంకులు మీ క్రెడిట్ కార్డ్‌పై నిర్దిష్ట నగదు పరిమితిని కేటాయిస్తారు, ఇది సాధారణంగా మీ మొత్తం పరిమితిలో 20% నుంచి 40% వరకు ఉంటుంది. క్రెడిట్ లిమిట్ అనేది మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఒక నెలలో మీరు ఖర్చు చేయగల గరిష్ట మొత్తం.

(ఇది కూడా చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త!)

ఉదాహరణకు, మీరు రూ.1 లక్ష క్రెడిట్ లిమిట్ కలిగి ఉన్న కార్డ్‌తో ఏటీఎం ద్వారా రూ. 20,000 నుంచి రూ.40,000 విత్ డ్రా చేయవచ్చు. ఆ క్రెడిట్ కార్డ్‌లో మిగిలిన మొత్తాన్ని కార్డ్ లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు.

Cash Advance Fee: మీరు గనుక మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేస్తే మీరు చేసే లావాదేవీ మొత్తంలో 2.5% నుంచి 3% వరకు ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. అయితే కనీస రుసుము లేదా రూ.500, ఏది ఎక్కువైతే ఆ ఛార్జీలు విధిస్తారు. ఉదాహరణకు, మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో రూ.40,000 విత్‌డ్రా చేస్తే అప్పుడు విత్‌డ్రావల్ రుసుము రూ.1,000(2.5 శాతం) విధిస్తారు.

అదే మీరు రూ.5,00 కంటే తక్కువ మొత్తం విత్‌డ్రా చేస్తే అప్పుడు మీపై రూ.500 + జీఎస్టీ ఛార్జ్ విధిస్తారు. ఈ రుసుము బ్యాంకును బట్టి మారుతుంది అనే విషయం గుర్తుంచుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles