Monday, September 16, 2024
HomeBusinessరైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ వ్యాలిడిటీ ఎంతవరకో మీకు తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ వ్యాలిడిటీ ఎంతవరకో మీకు తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Platform Ticket Rules Indian Railways: మనం ఎప్పుడోకప్పుడు ఒకసారి ఏదో ఒక సందర్భంలో బందువులను లేదా స్నేహితులను తీసుకొని రావడానికి లేదా రైలు ఎక్కించడానికి రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఉంటాం. అలా రైల్వే స్టేషన్‌కి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పై నిల్చోవాలంటే తప్పనిసరిగా ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ కొనుక్కోవాలనే విషయం మన అందరికే తెలిసిందే. అయితే చాలా మందికి తెలియని ఒక విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

(Cheapest Electric Scooters: ఈవీ మార్కెట్లో లభిస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!)

అదే మీ ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకొని ఆ రైల్వే స్టేషన్’లో ఎంతసేపు అక్కడ ఉండవచ్చు అనేది?. ఇక నుంచి మీ స్నేహితులు, బంధువుల్లో ఎవరినైనా పిక్‌ చేసుకోవడానికి లేదా డ్రాప్‌ చేయడానికి రైల్వే స్టేషన్‌కు వెళితే.. ప్లాట్‌ఫామ్ టికెట్‌ కొన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకోండి. రెండు గంటలు దాటిన తర్వాత ప్లాట్‌ఫామ్‌పై మీరు అక్కడే ఉంటే.. జరిమానా చెల్లించాల్సి రావచ్చు.

రూల్ ఇదే.. : రైల్వే వెబ్‌సైట్ ప్రకారం.. మీరు తీసుకున్న ప్లాట్‌ఫామ్‌ టికెట్ వ్యాలిడిటీ అనేది రెండు గంటలు మాత్రమే. అంటే టికెట్ కొనుక్కున్న తర్వాత రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై మనం ఉండొచ్చు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది మీకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అయితే ఏ ప్రాంతంలో స్టేషన్‌ ఉంది అనే దాన్ని బట్టి ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ల ధర మారుతూ ఉంటుంది. ఈ మొత్తం విలువ దాదాపు రూ. 10 నుంచి రూ. 50 వరకు మారుతూ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.

పెనాల్టీ : మీరు ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ తీసుకోకపోతే రైల్వే టికెట్ తనిఖీ సిబ్బంది కనీసం రూ. 250 వరకు జరిమానా విధించవచ్చు. ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ లేదా ప్రయాణ టికెట్ లేకుండా ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుడు పట్టుబడితే జరిమానా చాలా ఎక్కువగా విధించే అవకాశం ఉంటుంది. అంతకు ముందు ప్లాట్‌ఫామ్‌ నుంచి బయలుదేరిన మునుపటి రైలు ఛార్జీకి రెండింతలు జరిమానా వేస్తారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles