Wednesday, October 16, 2024
HomeGovernmentTelanganaPrajapalana Application Status: ప్రజాపాలన దరఖాస్తుల స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?

Prajapalana Application Status: ప్రజాపాలన దరఖాస్తుల స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?

Prajapalana Application Status: కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీ పథకాల అమలు కోసం డిసెంబర్ 28 తేదీ నుండి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 5 గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు వస్తే.. రేషన్ కార్డు వంటి ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు ఉన్నాయి.

ఈ ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులనన్నింటినీ జనవరి చివరి వరకు డేటా ఎంట్రీని పూర్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కలెక్టర్లను ఆదేశించింది. డేటా ఎంట్రీ తరువాత కేబినెట్, అలాగే సబ్ కమిటీలో చర్చలు జరిపి విధివిధానాలు అర్హులను ప్రకటించనున్నారు. అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి అమలు చేయనున్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ కూడా సిద్దం చేసింది.

ప్రజాపాలన దరఖాస్తుల స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?

  • మొదట https://prajapalana.telangana.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత Know your Application Status ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ అప్లికేషన్ నంబర్ నమోదు చేయండి.
  • Note: డేటా ఎంట్రీ పూర్తి అయిన తర్వాత మీ మొబైల్‌కి అప్లికేషన్ నెంబర్ వస్తుంది.
  • ఆ తర్వాత మీ అప్లికేషన్ ఆమోదం పొందితే మీరు పేర్కొన్న పథకాలకు అర్హత సాధిస్తారు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles