ప్రతి నెల 1వ తారీఖున దేశంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొని వస్తాయి. అలాగే, ప్రైవేట్ సంస్థలు కూడా వాటి ఉత్పత్తుల ధరలను కూడా ప్రతి నెల 1వ తారీఖున సవరిస్తాయి. దీంతో దేశ మొత్తం ప్రతి నెల 1వ తారీఖున కొత్తగా అమలులోకి వచ్చే ఈ రూల్స్ వల్ల చాలా వరకు సామాన్యుల జొబులకు చిల్లుపడుతుంది. కొత్త ఏడాది జనవరి 1వ తేదీన కూడా కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంక్: ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంక్ 2022 జనవరి 1 నుంచి ఖాతాదారులు విత్ డ్రా, డిపాజిట్ చేసే నగదు మీద సర్వీస్ చార్జ్ విధించనున్నట్లు తెలిపింది. ఈ సర్విస్ చార్జ్ విత్ డ్రా, డిపాజిట్ చేసే నగదులో 0.50 శాతం(కనీసం రూ.20) వరకు ఉంటుంది.
ఈపీఎఫ్ నామినేషన్: ఈపీఎఫ్ తన ఖాతాదారులకు కీలక సూచన చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా డిసెంబర్ 31 లోపు తమ పీఎఫ్ ఖాతాలకు నామీని జత చేయాలని లేకపోతే జనవరి 1 నుంచి ఈపీఎఫ్, ఈపీస్, ఈడిఎల్ఐ బెనెఫిట్స్ పొందలేరని పేర్కొంది.
(చదవండి: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఖాతాలో 10వ విడత డబ్బులు పడేది అప్పుడే!)
ఏటీఎం ఛార్జీలు: జనవరి నుంచి అన్నీ బ్యాంకుల ఎటిఎమ్ ఛార్జీలు రూ.1 పెరగనుంది. ఇది వరకు ఇది రూ.20గా ఉండగా, రూ.21కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.
ఎల్‌పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, వచ్చే జనవరి 1 తేదీన కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఏడాదికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
జీఎస్‌టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.
(చదవండి: రైతులకు ఎస్బీఐ శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణాలు!)
పెరగనున్న బైక్, కార్ల ధరలు: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ బైక్, కార్ల ధరలను 2022 జనవరిలో పెంచనున్నట్లు ప్రకటించాయి.