Okaya-Faast-Electric-Scooter

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకాయా తన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇండియన్ ఈవీ స్టార్టప్ ఒకాయా గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈవీ ఎక్స్ పో 2021లో రూ.90,000 ధరకు హైస్పీడ్ ఎలక్ట్రిక్-స్కూటర్ లాంఛ్ చేసింది. రూ.1,999 మొత్తానికి ఈ-స్కూటర్ని బుకింగ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఒకాయా ఎలక్ట్రిక్ వేహికల్ అధికారిక వెబ్ సైట్ లేదా డీలర్ షిప్ వద్ద బుకింగ్ చేసుకోవచ్చు అని పేర్కొంది.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌కు సహకరించే ఈ ‘ఫాస్ట్’ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గరిష్ఠ వేగం గంటకు 60-70 కి.మీ. దీనిని ఒక్కసారి ఛార్జి చేస్తే 150-200 కి.మీ. ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. 4.4 కిలోవాట్‌ లిథియమ్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీ, పూర్తిగా ఎల్‌ఈడీ లైట్లు, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, కాంబీ బ్రేకింగ్‌ సిస్టమ్‌ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని వివరించింది. త్వరలోనే విడుదల చేయనున్న విద్యుత్తు మోటార్‌సైకిల్‌ ‘ఫెరాటో’ను కూడా సంస్థ ఆవిష్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో దీనిని విడుదల చేసే అవకాశం ఉంది. ఫెర్రాటో 2 కిలోవాట్ మోటార్, 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80-90 కిలోమీటర్లు.

(చదవండి: అమ్మో 1వ తారీఖు.. జనవరి 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్..!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here