Reserve of Lithium in Jammu and Kashmir

Reserve of Lithium in Jammu and Kashmir: దేశంలో తొలిసారిగా భారీ మొత్తంలో లిథియం నిల్వలను జమ్మూ కశ్మీర్‌‌లో కనుగొన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మొత్తం 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్ర గనుల శాఖ తెలిపింది. నాన్-ఫెర్రస్ ఖనిజమైన లిథియం.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీలో వాడే కీలకమైన మూలకం ఈ లిథియం.

‘‘భారత భూ భౌతిక సర్వేక్షణ సంస్థ 5.9 మిలియన్ టన్నుల లిథియం వనరులను జమ్మూ కశ్మీర్ రియాసీ జిల్లా సలాల్-హయామన్ ప్రాంతంలో గుర్తించినట్లు’’ కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. దీనిపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. పారిశశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందిస్తూ.. ఇక సందేహం లేదు, భారతదేశం భవిష్యత్తు అంతా ఎలక్ట్రి ఫైయింగే అంటూ ట్విట్ చేశారు.

ఇక భవిష్యత్తులో ఈ-వాహనాల్లో భారత్‌ దూసుకుపోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే అభిప్రాయాన్ని ఆనంద్‌ మహీంద్ర వ్యక్తం చేశారు. లిథియం నిక్షేపాల ఆవిష్కరణతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధర మరింత దిగిరానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారీగా లిథియం నిల్వల గుర్తింపుతో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. .

ప్రపంచ వ్యాప్తంగా లిథియం నిల్వలను పరిశీలిస్తే.. ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1) చిలీ – 8 మిలియన్ టన్నులు

2) ఆస్ట్రేలియా – 2.7 మిలియన్ టన్నులు

3) అర్జెంటీనా – 2 మిలియన్ టన్నులు

4) చైనా – 1 మిలియన్ టన్నులు

జమ్మూ కశ్మీర్ రియాసీ జిల్లాలో దొరికిన లిథియం నాణ్యమైనదేనా..?

ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రియాసీ జిల్లాలో దొరికిన లిథియం నిల్వలు అత్యుత్తమ నాణ్యత గలదు అని జెకె మైనింగ్ సెక్రటరీ శర్మ చెప్పారు . సాధారణ గ్రేడ్ 220 పార్ట్స్ పర్ మిలియన్ (PPM)కి వ్యతిరేకంగా, J&Kలో లభించే లిథియం 500 ppm-ప్లస్ గ్రేడింగ్ అని, 5.9 మిలియన్ టన్నుల నిల్వలతో భారతదేశం లిథియం లభ్యతలో చైనాను అధిగమిస్తుందని ఆయన అన్నారు.