Friday, May 3, 2024
HomeBusinessLPG KYC Online: ఆన్‌లైన్‌లో ఎల్‌పీజీ కేవైసీ అప్‌డేట్ చేసుకోండి ఇలా..?

LPG KYC Online: ఆన్‌లైన్‌లో ఎల్‌పీజీ కేవైసీ అప్‌డేట్ చేసుకోండి ఇలా..?

LPG e-KYC Update in Online: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో(Congress 6 Guarantees) రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ కూడా ఒకటి. త్వరలోనే ఈ గ్యారెంటీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ పథకం అమలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు.

(ఇది కూడా చదవండి: Update Aadhar Card: ఆధార్‌ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి ఇలా..?)

ప్రభుత్వం నిబంధనలు ప్రకటించకపోయినా.. తమకు ఈ స్కీమ్ వర్తించకుండా పోతుందేమోనని కేవైసీ అప్‌డేట్ చేయడానికి గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు డీలర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ‌న్‌లైన్‌లోనే ఎల్‌పీజీ ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆన్‌లైన్‌లో ఎల్‌పీజీ ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోండి ఇలా..?

  • ముందుగా https://www.mylpg.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీ పైన Bharat Gas, HP Gas, Indane Gas సిలిండర్ల ఫోటోలు కనిపిస్తాయి.
  • మీ దగ్గర ఏ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఆ ఫోటోపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ సహాయంతో లాగిన్ కావాలి.
  • లాగిన్ అయిన తర్వాత కేవైసీ అప్‌డేట్ చేశారో లేదో చెక్ చేయాలి.
  • కేవైసీ అప్‌డేట్ లేకపోతే దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి ఏజెన్సీలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles