Excise Duty on Petrol, Diesel

గత కొద్ది రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చమురు ధరలు పేరుగుదలతో ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. అయితే, ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ మీద ఎవరు ఎంత పన్ను విధిస్తున్నారు అనేది చాలా అస్పష్టంగా ఉండేది. నిన్న జరిగిన లోక్ సభలో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ మీద కేంద్రం ఎంత పన్ను విధిస్తున్న తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. లీటరు పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.27.90, లీటరు డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.21.80 కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభలో ఏఐటీసీ ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిపింది.

పెట్రోల్ మీద కేంద్రం విధిస్తున్న పన్నులు(లీటరుకు)

  • బేసిక్ ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.1.40,
  • ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.11,
  • అదనపు ఎక్సైజ్ సుంకం(రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్)గా రూ.13,
  • వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం రూ.2.50,
  • మొత్తం కేంద్రం పన్నుల రూపంలో పెట్రోల్ మీద వసూలు చేస్తున్న డబ్బు లీటరుకు = రూ.27.90పైసలు

(చదవండి: పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే పన్నులలో కేంద్ర, రాష్ట్రాలలో ఎవరు ఎక్కువగా తింటున్నారు?)

బేసిక్ ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.1.40 వసూలు చేస్తున్న డబ్బులో మాత్రమే సగం(70 పైసలు) 29 రాష్ట్రాలకు వెళ్తుంది. ఈ 70 పైసలను 29 రాష్ట్రాలు కలిసి పంచుకుంటాయి.

డీజిల్ మీద కేంద్రం విధిస్తున్న పన్నులు(లీటరుకు)

  • బేసిక్ ఎక్సైజ్ సుంకంగా రూ.1.80,
  • ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంగా రూ.8,
  • అదనపు ఎక్సైజ్ సుంకం(రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్)గా రూ.8,
  • వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం రూ.4,
  • మొత్తం కేంద్రం పన్నుల రూపంలో డీజిల్ మీద వసూలు చేస్తున్న డబ్బు లీటరుకు = రూ.21.80పైసలు

2019కు ముందు మాత్రం పెట్రోల్, డీజిల్ మీద రూ.9.48 ఎక్సైజ్ సుంకన్నీ వసూలు చేసేది. కానీ, ఇప్పుడు ఆ సుంకన్నీ 3 రేట్లు పెంచింది. గత కొన్ని నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అయితే, 25 రోజులుగా మాత్రం ఇంధన ధరలలో ఎటువంటి మార్పు లేదు. అయినప్పటికీ, ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97, లీటర్ డీజిల్ ధర రూ.86.67గా ఉంది. ఇక హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.108.20, లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ మీద వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం ఈ నెల ప్రారంభంలో వరుసగా పెట్రోల్ మీద రూ.5, డీజిల్ మీద రూ.10 తగ్గించింది.