పెట్రోల్, డీజిల్‌ ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై సెప్టెంబర్ 17న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగబోయే 45వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సమావేశంలో కోవిడ్-చికిత్స ఔషధాలపై పన్ను రాయితీలను డిసెంబర్ 31 వరకు పొడగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ చేర్చే అంశంపై జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకోవాలి అని జూన్‌లో కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 17న జరగబోయే సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, జీఎస్‌టీ వ్యవస్థలో ఏదైనా మార్పు చేయాలంటే ప్యానెల్‌లోని 3/4 ప్రతినిదుల ఆమోదం అవసరం. ఈ జీఎస్‌టీ ప్యానెల్‌లో అన్ని రాష్ట్రాలు, భూభాగాల ప్రతినిధులు ఉంటారు. మన దేశంలో ఇంధనంపై విధించే పన్నులే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.

లాభం ఏంటి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘పెట్రో’పై భారీగా వసూలు చేస్తున్న పన్ను ఆదాయంలో కొంత కోల్పోవడానికి ముందుకు వస్తేనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. త్వరలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకు రావచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేల అదే నిజమైతే! ఇది సామాన్యుడికి భారీ ఊరటే అని చెప్పుకోవాలి. నిజంగానే పెట్రోల్, డీజిల్‌ గనుక జీఎస్‌టీ పరిధిలోకి వస్తే చాలా వరకు ఇంధన ధరలు రూ.30 వరకు తగ్గే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here