Weekly-Payout

ప్ర‌పంచ దేశాల్లో కోవిడ్ కార‌ణంగా ఉద్యోగుల పని విధానమే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో నుంచే పని చేస్తున్నారు. అయితే, పని విధానంతో పాటు ఉద్యోగుల చెల్లించే నెల‌వారీ జీతాల విధానం కూడా పూర్తిగా మారిపోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా కంపెనీలు నెల‌కు ఒకసారి మాత్ర‌మే ఉద్యోగుల‌కు జీతాల్ని చెల్లిస్తుండేవి. కానీ, ఇప్పుడు ఆ విధానానికి స్వ‌స్తి ప‌లికి వారానికి జీతాలు చెల్లించేందుకు సిద్దం చూపుతున్నాయి.

ఇప్పటికే ఇలాంటి విధానం అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి దేశాల్లో కొనసాగుతుంది. ఇప్పుడు ఈ క‌ల్చ‌ర్ ఇండియాలో మొద‌లైంది. దేశీయ బీ2బీ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ సంస్థ ఇండియా మార్ట్ ఉద్యోగులకు ప్రతి నెల కాకుండా వారం వారం జీతాల్ని చెల్లించాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని ఇండియా మార్ట్ సీఈఓ దినేష్ అగర్వాల్ తన సోష‌ల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. వారానికి ఒక‌సారి జీతాలు చెల్లించ‌డం ద్వారా ఉద్యోగులకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు త‌లెత్త‌వ‌ని, త‌ద్వారా వ‌ర్క్ ప్రొడ‌క్టివిటీ పెరుగుతుంద‌ని ఇండియా మార్ట్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది.

అది అలా ఉంటే, డిసెంబర్ 2021 త్రైమాసికంలో ఇండియామార్ట్ ఏకీకృత నికర లాభంలో 12.4 శాతం క్షీణించి రూ.70.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.80.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఎఫ్‌వై22 3వ త్రైమాసికంలో దీని ఆదాయం రూ.173.6 కోట్ల నుంచి 8.3 శాతం పెరిగి రూ.188.1 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్లో సంస్థ తెలిపింది.

(ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ ఈవీ స్టార్టప్‌ సంచలనం.. ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌లో చోటు!)