ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో టాప్ కంపెనీ పేరు ఏది అంటే? అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు టెస్లా అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో అనేక రికార్డులను తన పేరు మీద లికించుకుంది. అయితే, ఇలాంటి టెస్లాకు గట్టిపోటీ ఇవ్వాలంటే ఎలక్ట్రిక్ కార్లలో రేంజ్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎలక్ట్రిక్ కార్లల్లో రేంజ్‌ను ముఖ్యంగా భావించిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఈవీ కార్ల ఉత్పత్తిలో ఒక ముందడుగు వేసింది.
(చదవండి: సామాన్యులకు కేంద్రం భారీ షాక్.. ఆటో ఎక్కితే జీఎస్‌టీ కట్టాల్సిందే..!)
1000 కిమీ రేంజ్!
ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ విషయంలో మెర్సిడెజ్ బెంజ్ సంచలన విజయాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 1,000 కిమీ దూరం వెల్లనుంది. ఈ ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది జనవరి 3 మెర్సిడెజ్ ఆవిష్కరించనుంది. మెర్సిడెజ్ విజన్ ఈక్యూఎక్స్‌ఎక్స్ కాన్సెప్ట్ కారుకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్ ఫీచర్‌తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా విజన్ ఈక్యూఎక్స్‌ఎక్స్ నిలుస్తోందని కంపెనీ సీవోవో మార్కస్ స్కాఫర్ వెల్లడించారు.