PAN-Aadhaar Link in Telugu: పాన్ కార్డ్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. ఆధార్ కార్డుతో పాన్ కార్డు(PAN Card) లింక్ చేయని వారిని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. 2023 మార్చి 31లోగా పాన్ కార్డ్’తో- ఆధార్ కార్డు లింక్(PAN-Aadhaar Link) చేయాలని సూచించింది. చేయకపోతే ఆ తర్వాత ఆధార్ కార్డ్ లింక్ చేయని పాన్ కార్డులు ఏవీ చెల్లవు అని తెలిపింది. ఇప్పుడు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని అనుకుంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
(ఇది చదవండి: Pan card: మీ పాన్ కార్డ్ పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!)
ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్ కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ అని, అప్పట్లోగా తమ పాన్-ఆధార్ లింక్ చేయాలని, ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవు అని, అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే పాన్-ఆధార్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
గతంలో అనేకసార్లు ఆదాయపు పన్ను శాఖ లింకు గడువును కూడా పొడిగించింది. చివరిసారి విధించిన గడువు జూన్ 30తో ముగిసింది. అయితే ఇప్పుడు రూ.1,000 జరిమానా చెల్లించి పాన్-ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు కూడా 2023 మార్చి 31న ముగియనుంది. ఆ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులన్నీ కేవలం ప్లాస్టిక్ కార్డులుగా మిగిలిపోనున్నాయి.