Sunday, April 21, 2024
HomeGovernmentAadhaar Card: గుర్తింపు పత్రంగా ఆధార్‌ కార్డు.. యూఐడీఏఐ కీలక ప్రకటన!

Aadhaar Card: గుర్తింపు పత్రంగా ఆధార్‌ కార్డు.. యూఐడీఏఐ కీలక ప్రకటన!

Identity Proof of Aadhaar Card: ఇటీవల రోజుల్లో ఆధార్‌ కార్డు చాలా ముఖ్యంగా మారిపోయింది. ఇది కేవలం గుర్తింపు కార్డులా మాత్రమే కాకుండా ప్రభుత్వ పథకాలలో, బ్యాంక్‌ ఖాతా వంటి వాటికి కూడా చాలా కీలకం అనే విషయం మనకు తెలుసు. అలాంటి ఆధార్ విషయమలో తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’(యూఐడీఏఐ) ఒక కీలక ప్రకటన చేసింది.

ఇకపై వ్యక్తిగత గుర్తింపు ఆధార్‌ విషయంలో… ఆధార్‌ వివరాలను ధృవీకరించుకున్న తర్వాతే దీన్ని ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా అంగీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర సంస్థలకు సూచించింది. ఈ ఆధార్‌, ఆధార్‌ లెటర్‌, ఆధార్‌ పీవీసీ కార్డ్‌.. ఈ విధంగా ఆధార్‌ ఏ రూపంలో ముందుగా అందులో ఉన్న వివరాలు సరైనవా? కాదా? అని ధృవీకరణ తప్పనిసరని యూఐడీఏఐ హెచ్చరించింది. ఆధార్‌ ధృవీకరణ కోసమే క్యూఆర్‌ కోడ్‌లు, ఎం-ఆధార్‌ యాప్‌, ఆధార్‌ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌లు ఉన్నాయని తెలిపింది.

(ఇది కూడా చదవండి: ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయడం ఎలా?)

డెస్క్‌యాప్‌ వెర్షన్‌తో పాటు మొబైల్స్‌ ద్వారా ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు సెప్టెంబర్‌లో యూఐడీఏ ఆధార్‌ వివరాలని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి పలు కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం తీసుకొస్తున్న కొత్త నియమ నిబంధనల వల్ల ఆధార్‌ వినియోగం సక్రమంగా జరుగుతుందని, నకిలీ ఆధార్‌ల కట్టడి చేస్తున్నామని వెల్లడించింది.

ఆధార్‌ పత్రాలను ట్యాంపరింగ్‌ గనుక చేస్తే.. ఆధార్‌ యాక్ట్‌ సెక్షన్‌ 35 ప్రకారం శిక్షార్హమైన నేరమని, జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుందని తెలిపింది. అంతేకాదు ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ కింద ఆధార్‌ సమర్పించేప్పుడు దానిని ధృవీకరించుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్రాలు తప్పనిసరి చేయాలంటూ యూఐడీఏఐ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles