Sunday, November 3, 2024
HomeGovernmentTelangana: మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి

Telangana: మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి

Rs 1 Lakh Financial Assistance to Minorities: మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని పేద మైనార్టీ ప్రజలకు రూ 1,00,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ ఆర్థిక సాయం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై మైనార్టీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

(ఇది కూడా చదవండి: గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!)

బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఈ నగదును ల‌బ్ధిదారుల‌కు అంద‌జేస్తారు. తిరిగి తీసుకున్న మళ్లీ చెల్లించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పేద మైనార్టీలను ఆర్థికంగా ఆదుకునేందుకు వీలుగా ఒక్కో పేద కుటుంబానికి రూ.ల‌క్ష ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందింది.

ఏమిటీ ఈ ప‌థ‌కం ఉద్దేశ్యం?

తెలంగాణ ప్ర‌భుత్వ గ‌ణాంకాల ప్ర‌కారం రాష్ట్రంలో సుమారుగా 16 శాతం మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే, వీరిలో చాలా మంది పేద‌రికంలో జీవిస్తున్నారని అనేక ప్రభుత్వ సర్వేలు చెప్తున్నాయి. ఎక్కువ మంది మైనార్టీ ప్రజలు చేతివృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగుస్తున్నారు.

ఆర్థిక సాయం ఎలా అందజేస్తారు?

  • రాష్ట్రంలోని క్రైస్త‌వుల‌కు ‘టీఎస్ క్రిస్టియ‌న్ ఫైనాన్స్ కార్పొరేష‌న్’ ద్వారా ఆర్థిక సాయం అంద‌జేస్తారు.
  • మిగిలిన మైనార్టీల‌కు మాత్రం ‘టీఎస్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేష‌న్’ ద్వారా ఈ సాయం అందించనున్నారు.

ఈ సాయం ఎందుకు అందిస్తున్నారు?

ఈ సాయం అందుకున్న మైనార్టీ ప్రజలు తాము చేస్తున్న చేతి వృత్తుల‌కు సంబంధించి ప‌రికరాలు కొనుగోలు చేసుకోవ‌డానికి, వారు చేస్తున్న వ్యాపారాలను మ‌రికొంత విస్త‌రింప‌జేసుకోవ‌డానికి అందిస్తున్నారు.

రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుకోవడానికి ఎవరు అర్హులు?

  • ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మొదట తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
  • లబ్ది దారులు క్రైస్త‌వులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు ఇత‌ర అల్ప సంఖ్యాక మతస్థులై ఉండాలి.
  • 2023 జూన్ 3వ తేదీ నాటికి 21 సంవ‌త్స‌రాలు పూర్తయి 55 ఏళ్ల లోపు వయస్సు గల వారై ఉండాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 ల‌క్ష‌లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రూ. 2 ల‌క్ష‌లు కంటే ఎక్కువ కుటుంబ వార్షిక ఆదాయం గల వారికి ఈ పథకం వర్తించదు.

ద‌ర‌ఖాస్తు చేసుకోవడం ఎలా?

  • ఈ ఆర్దిక సాయం కోసం మైనార్టీలు https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైటు ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
  • క్రిస్టియన్ మైనారిటీలు దరఖాస్తు చేసుకోవాలంటే https://tscmfc.in/ ద్వారా చేసుకోవచ్చు.
  • ఇతర మైనారిటీ ప్రజలు https://tsmfc.in/ వెబ్‌సైట్లో చేసుకోవాలి.
  • అయితే, దరఖాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయిలో లింకులు ఈ వెబ్‌సైట్లలో అందుబాటులోకి రాలేదు.

ఎంపిక విధానం ఎలా?

  • ఒక కుటుంబంలో ఒక్క‌రికి మాత్ర‌మే రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు.
  • లబ్ధిదారుల ఎంపిక అనేది పూర్తిగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ అధికార పరిధిలో ఉంటుంది.
  • జిల్లా క‌లెక్ట‌ర్ల ఆధ్వర్యంలో మానిట‌రింగ్‌, స్క్రీనింగ్ క‌మిటీలు ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేస్తాయి.
  • ఈ జాబితాలను ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లా మంత్రి పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.
  • ఆ తర్వాత లబ్ధిదారుల‌కు జిల్లా క‌లెక్టర్ ఆదేశాల‌తో ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తారు.

ఎంపికైన లబ్దిదారుల జాబితా వివరాలను తెలుసుకోవడం ఎలా..?

  • ఎంపికైన ల‌బ్ది దారుల జాబితాను మీ గ్రామ పంచాయ‌తీల్లో ప్ర‌ద‌ర్శిస్తారు.
  • అలాగే వివిధ మైనార్టీ కార్పొరేష‌న్ వెబ్‌సైట్ల‌లో కూడా జాబితాను ఉంచుతారు.
  • చెక్కుల‌ను స్థానిక ఎమ్మెల్యే ద్వారా ల‌బ్ధిదారుల‌కు అంద‌జేస్తారు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles