Friday, November 22, 2024
HomeBusinessBal Jeevan Bima Yojana: పోస్ట్ ఆఫీస్ బాల్ జీవన్ బీమా యోజనకు ఎలా దరఖాస్తు...

Bal Jeevan Bima Yojana: పోస్ట్ ఆఫీస్ బాల్ జీవన్ బీమా యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు

Post Office Bal Jeevan Bima Yojana Insurance Scheme Details in Telugu: దేశంలోని పిల్లలందరి భవిష్యత్తును సురక్షితంగా, ఉజ్వలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం బాల్ జీవన్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక సాధారణ పౌరుడు రోజుకు రూ. 6 పొదుపు చేస్తే రూ.6 లక్షల రూపాయల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

అస్సలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు.. ప్రయోజనాలు ఏమిటి? వాటికి కావాల్సిన అర్హతలు, అవసరమైన పత్రాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ పథకంలో భాగంగా కనిష్టంగా రోజుకు రూ. 6 నుంచి గరిష్టంగా రూ.18 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అది ఎంతన్నది మీ ఆర్థిక స్తోమతను బట్టి మీరే నిర్ణయించుకోవాలి. పిల్లల పేరుపై తల్లిదండ్రులు ఈ పొదుపు పథకాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.

బాల్ జీవన్ బీమా యోజన 2024 పథకం ముఖ్య ఉద్దేశ్యం:

ఈ పథకాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద పోస్టాఫీస్ నిర్వహిస్తుంది. పిల్లల మెరుగైన జీవితం, మెరుగైన భవిష్యత్తు అందించడమే ఈ బీమా ముఖ్య ఉద్దేశ్యం.

Bal Jeevan Bima Yojana

బాల్ జీవన్ బీమా యోజన దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు:

  • పథకం కోసం దరఖాస్తు చేయడానికి, పిల్లల వయస్సు 5 నుండి 20 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • లబ్ధిదారుని తల్లిదండ్రుల వయస్సు గరిష్టంగా 45 సంవత్సరాలు.
  • ఈ పథకం కింద కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

Bal Jeevan Bima Yojana నియమాలు

  • ఈ ప్లాన్ కింద మీరు రోజువారీ, నెలవారీ మరియు వార్షికంగా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.
  • ఈ పథకం కింద ఒక సాధారణ పౌరుడు రోజుకు రూ.6 నుంచి రూ.18 వరకు పొదుపు చేయవచ్చు.
  • బిడ్డ పాలసీ తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతే, బీమా మొత్తం బిడ్డకు చెల్లిస్తారు.
  • బీమా తీసుకునేటప్పుడు బిడ్డ చనిపోతే నామినీకి లేదా పాలసీదారుకి చెల్లింపు చేస్తారు.
  • ప్రతి రూ. 1000 మొత్తంపై.. ప్రతి ఏటా రూ. 48 బోనస్ కూడా లభిస్తుంది.
  • పాలసీ నుంచి మధ్యలో వైదొలగాలి అనుకుంటే, 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంది.
  • ఈ బీమా కాలపరిమితి 5 సంవత్సరాలు. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత, మీరు రూ. 1 లక్ష పొందుతారు.

బాల్ జీవన్ బీమా యోజన కోసం అవసరమైన పత్రాలు

  • పిల్లల ఆధార్ కార్డ్
  • తల్లిదండ్రుల ఆధార్ కార్డు
  • పిల్లల జనన ధృవీకరణ పత్రం
  • నివాస ధృవీకరణ పత్రం
  • మొబైల్ నంబర్
  • పిల్లల పాస్‌పోర్ట్ సైజు ఫోటో

బాల్ జీవన్ బీమా యోజన కింద దరఖాస్తు ప్రక్రియ

  • జీవిత బీమా ప్రయోజనాన్ని పొందడానికి, ముందుగా పిల్లల తల్లిదండ్రులు తమ ప్రాంతంలోని సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లాలి.
  • అక్కడికి వెళ్లిన తర్వాత, మీరు అధికారి నుంచి పిల్లల జీవిత బీమా పథకం కోసం దరఖాస్తు ఫారమ్‌ను తీసుకోండి.
  • ఆ తర్వాత పిల్లల పేరు, వయస్సు, చిరునామా, నామినీ మరియు దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అన్ని ఇతర సమాచారాన్ని సరిగ్గా పూరించాలి.
  • దీని తరువాత, ఫారమ్‌లో అడిగిన అవసరమైన పత్రాలను ఫారమ్‌తో జతచేయాలి.
  • దీని తర్వాత మీరు నింపిన ఫారమ్‌ను పోస్టాఫీసుకు సమర్పించాలి. అన్ని పత్రాలను ధృవీకరించిన తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్ కార్యాలయం నుండి పాస్‌బుక్ అందుకుంటారు.

(ఇది కూడా చదవండి: వాషింగ్ మెషీన్‌ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles