దేశవ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చాలా మంది ఖాతాదారులు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఎప్పటికప్పుడు కొత్త పాలసీలు, స్కీమ్ లు తీసుకోస్తూ ఉంటుంది. ఇలాగే, గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రధాన మంత్రి వయో వందన యోజన పెన్షన్ స్కీమ్ పేరుతో సరికొత్త పథకాన్ని వృద్దుల కోసం తీసుకొని వచ్చింది. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 సంవత్సరాలు ఉండాలి. అలాగే, దీని గడువు కాలం పది సంవత్సరాలు.
దీనిలో చేరిన వారు పెట్టుబడి పెట్టిన నగదుపై వార్షికనికి 7.66 వడ్డీ కూడా అందిస్తుంది. పీఎంవివివైలో చేరిన వారు రూ.1.62 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల రూ.1,000 నుంచి రూ.9,250 వరకు ప్రతి నెల వడ్డీ రూపంలో లభిస్తుంది.
పెట్టుబడి పెట్టిన నగదుపై లభించే వడ్డీని ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇస్తారు. అలాగే గడువుకాలం ముగిసిన తర్వాత పాలసీదారుడికీ పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు.
ఇందులో చేరిన వారికి మరో మంచి సదుపాయం కూడా ఉంది. పెట్టుబడి పెట్టిన నగదుపై మూడు ఏళ్ల తర్వాత 75 శాతం వరకు లోన్ తీసుకునే సదుపాయం ఉంది. పాలసీ దారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనక్కు తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనే దానిపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.