కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం కింద చేయూత అందించడానికి 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది రైతుల ఖాతాలో రూ.6 వేల రూపాయలను మూడు విడతలలో జమ చేస్తుంది. అయితే, ఈ ఏడాది కూడా 8 వ విడత నగదును రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు నకిలీ వార్తలు వస్తున్నాయి.(ఇది చదవండి: పీఎం కీసాన్ డబ్బులు రావడం లేదా?.. అయితే వెంటనే ఇలా చేయండి)
ప్రతి ఒక్కరూ మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవాలని వాట్సాప్ లో వార్తలు వస్తున్నాయి. కానీ, నిజానికి కేంద్ర ప్రభుత్వం 8వ విడత నగదును విడుదల చేయలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ సహాయ శాఖ మంత్రి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం గత కొద్దీ రోజుల నుంచి 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో నగదు విడుదల ఆలస్యం అయినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 20 నుంచి 30 మధ్యలో 8వ విడత నగదు రూ.2వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 8వ విడత డబ్బులు వస్తున్న వార్తలు నిజం కాదు, రైతుల ఖాతాలో నగదు ఇంకా జమ చేయలేదు అంటూ పేర్కొన్నారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.