Rupay Credit Card On UPI
Rupay Credit Card On UPI

SBI, Axis and ICICI Bank To Launch Rupay Credit Card On UPI: మీ దగ్గర ఎస్‌బీఐ (SBI), ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్, (Axis)యాక్సిస్ బ్యాంక్‌లకు చెందిన క్రెడిట్ కార్డులు ఉన్నాయా?, అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. వ‌చ్చే ఏడాది 2023 మార్చి నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవ‌లను అందుబాటులోకి తీసుకొనిరావలని ఆ బ్యాంకులు చూస్తున్నాయి.

ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు ఇండియన్ బ్యాంక్తో పాటు ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC బ్యాంక్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI) సేవ‌లను అందిస్తున్నాయి. 2022 జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్‌లను UPIకి లింక్ చేయడానికి అనుమతించింది.

(ఇది కూడా చదవండి: Cibil Score: వాట్సప్‌లో సిబిల్ స్కోర్ ఉచితంగా చెక్ చేసుకోవడం ఎలా..?)

నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(NCPI) రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ ఫీచ‌ర్‌ను గతంలో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఫీచర్ కింద రోజుకు రూ.50 ల‌క్ష‌ల విలువైన లావాదేవీలు జ‌రుగుతున్నాయని ఎన్‌పీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.

భవిష్యత్తులో ఇత‌ర అతిపెద్ద క్రెడిట్ జారీ సంస్థ‌లు యూపీఐ సేవ‌ల‌ను అందుబాటులోకి తేవడం ద్వారా భారీగా లావాదేవీలు జరగనున్నాయి. రూపే మరియు UPIని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది.

(ఇది కూడా చదవండి: Credit Score: పేటీఎంలో ఉచితంగా మీ క్రెడిట్‌ స్కోర్‌ను ఇలా తెలుసుకోండి..)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here