Aadhar Card
How To Download Aadhar Card,

Aadhar Card Download: మన దేశంలో వివిధ సేవలను పొందేందుకు ఆధార్ కార్డు అత్యంత కీలకమైన పత్రాలలో ఒకటి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఉద్యోగం పొందినప్పుడు, రుణాలు తీసుకునేటప్పుడు ఇలా ఒకటి ఏమిటి ప్రతి దానికి ఆధార్ కార్డ్ అనేది చాలా కీలకం.

అలాంటి, ముఖ్యమైన గుర్తింపు కార్డును కొందరూ వినియోగదారులు కోల్పోయే అవకాశం ఉంది. అయితే, ఇలాంటి సందర్భాలలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు పొరపాటున మిస్ చేసుకున్న వారు ఇప్పుడు సులభంగానే కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

  • అధికారిక వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, క్యాప్చ కోడ్‌ నమోదు చేసి Send OTP మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఇప్పుడు ఆ OTPని నమోదు చేయండి
  • ఇప్పుడు మీ ఆధార్ కార్డు Download ఆప్షన్ మీద క్లిక్ చేసిన డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు పీడీఎఫ్ పాస్‌వర్డ్ ఏంటి?

ఉదాహరణకు పేరు RAMARAJU, పుట్టిన తేదీ – 11-01-1990 ఉంటే.. మీ ఈ-ఆధార్ పీడీఎఫ్ డాక్యుమెంట్ పాస్‌వర్డ్ RAMA1990గా ఉంటుంది.

ఉమాంగ్ యాప్‌లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  • మొదట ఉమాంగ్(UMANG) యాప్‌ ఓపెన్ చేయండి
  • ఇప్పుడు My Aadhaar ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత Download Aadhaar ఆప్షన్ మీద నొక్కండి.
  • ఇప్పుడు ఆధార్ నెంబర్, క్యాప్చ కోడ్ నమోదు చేసి Send OTP మీద ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీ ఆధార్ నెంబర్కు లింకు చేసిన మొబైల్’కి వచ్చిన ఓటీపీ నమోదు చేయండి.
  • చివరిగా మీకు Download Aadhaar ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.