Monday, November 4, 2024
HomeGovernmentఆధార్ కార్డు యూజర్లకు భారీ షాక్.. ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు!

ఆధార్ కార్డు యూజర్లకు భారీ షాక్.. ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు!

Aadhaar PVC Card: ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ భారీ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న ఈ నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది. అలాంటి పీవీసీ కార్డ్‌లు ఎలాంటి సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉండవని తెలిపింది.

(ఇది కూడా చదవండి: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ఐఓసీఏల్ శుభవార్త..!)

ఇంకా ప్లాస్టిక్ ఆధార్ కార్డులను వినియోగించవద్దు అని కూడా పేర్కొంది. కాబట్టి మీరు నకిలీ ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డ్‌ని తీసుకోకండి. అలాగే, పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించి ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్‌లో పేర్కొంది.

ఆర్డర్ కోసం ఒక లింక్ కూడా యుఐడీఏఐ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఈ కార్డులో అనేక భద్రత ప్రమాణాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ పీవీసీ ఆధార్ కార్డు కోసం వెబ్ సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వ పనులు కోసం దీనిని వినియోగించవచ్చు అని తెలిపింది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles